ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కరోజులో సూర్యుడినైనా మింగేయగల కృష్ణబిలం.. కనిపెట్టిన శాస్తవేత్తలు

ABN, First Publish Date - 2020-07-04T01:33:22+05:30

విశ్వంలో మానవుడికి ఇంతవరకు అంతుచిక్కని విషయం కృష్ణబిలం. చిమ్మ చీకటితో నిండి ఉండి కనీసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: విశ్వంలో మానవుడికి ఇంతవరకు అంతుచిక్కని విషయం కృష్ణబిలం. చిమ్మ చీకటితో నిండి ఉండి కనీసం గుర్తించడానికి కూడా కష్టంగా ఉంటాయి ఇవి. అయితే కృష్ణబిలం మధ్యలో విపరీతమైన శక్తి విడుదలవుతూ ఉంటుంది. దానిని బట్టి ఆ కృష్ణబిలం శక్తిని అంచనావేస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. చుట్టుపక్కల ఉండే పదార్థాన్ని కృష్ణబిలాలు ఏ స్థాయిలో శోషణ చేసుకుంటున్నాయో కూడా దీని ద్వారానే తెలుసుకుంటారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ భారీ కృష్ణబిలంపై ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్రిస్టోఫర్ ఒన్‌కెన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసింది. అందులో ఓ అరుదైన విషయాన్ని కనుగొంది.


జే2157 అనే కృష్ణబిలం విశ్వంలోనే అత్యంత వేగంగా పెరుగుతోందని, మన పాలపుంత కేంద్రంలో ఉన్న సూపర్‌మ్యాసివ్ కృష్ణబిలంకంటే ఇది 8వేల రెట్లు పెద్దదిగా ఉందని తెలిపింది. ఇది ప్రతి రోజూ దాదాపు మన సూర్యుడిని సమానమైన పదార్థాన్ని మింగేస్తోందని వెల్లడించింది. విశ్వంలో ఇంత పెద్దదైన కృష్ణబిలం మరొకటి ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించలేదని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.

Updated Date - 2020-07-04T01:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising