ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్క వయస్సుకు శాస్త్రవేత్తల కొత్త భాష్యం

ABN, First Publish Date - 2020-07-03T21:53:21+05:30

పెంపుడు జంతువుల్లో మనుషులు ఎక్కువగా పెంచుకునేది శునకాలనే. అయితే కుక్కల వయస్సును మనషులతో పోల్చి చెప్పేటప్పుడు గతంలో ఓ ఫార్ములాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పెంపుడు జంతువుల్లో మనుషులు ఎక్కువగా పెంచుకునేది శునకాలనే. అయితే కుక్కల వయస్సును మనషులతో పోల్చి చెప్పేటప్పుడు గతంలో ఓ ఫార్ములాను సైంటిస్టులు ఉపయోగించేవారు. ఉదాహరణకు 10 ఏళ్ల కుక్క.. 70ఏళ్ల మనిషితో సమానమని చెప్పేవారు. అయితే ఈ లెక్క సరికాదని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కుక్కుల జన్యుక్రమాన్ని అనుసరించి కొత్త ఫార్ములాను కనుగొన్నామని, అది కచ్చితమైనది అంటున్నారు. వాళ్ల తాజా లెక్కల ప్రకారం ఏడాది వయస్సున్న కుక్క.. 30 ఏళ్ల వయస్సున్న వ్యక్తి పరిపక్వతతో ఉంటుందని అంటున్నారు. అయితే ఇది కుక్క వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుందని.. నాలుగేళ్ల వయస్సున్న కుక్క.. 54 ఏళ్ల వయస్సున్న వ్యక్తితో సమానమని చెప్పారు. అలాగే 9 ఏళ్ల వయస్సున్న కుక్క దాదాపు 60 ఏళ్ల వ్యక్తికి సమానమని అన్నారు. తాము 105 లాబ్రాడర్ శునకాలపై ప్రయోగాలు చేశామని తెలిపారు. వాటి రక్తనమూనాలను సేకరించి.. పరిశోధించగా ఈ తేడా తెలిసిందని అన్నారు. జన్యుక్రమంలో మార్పులు తెలుసుకోగలిగామన్నారు. అయితే తాము ఒకే జాతి శునకాలపై ఈ ప్రయోగాలు జరిపామని, వివిధ రకాల శునక జాతులపై ప్రయోగాలు జరపాల్సి ఉందని చెప్పారు.

Updated Date - 2020-07-03T21:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising