ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా కనుగొన్న జీవి పేరు ‘ట్విటర్’ అంట! ఆ పేరే ఎందుకంటే..

ABN, First Publish Date - 2020-05-17T00:51:11+05:30

ట్విటర్ అంటే అందరికీ సామాజిక మాధ్యమమే గుర్తుకు వస్తుంది. అయితే ఇకపై ఆ పరిస్థితి మారనుంది. ఇటీవల ఓ కొత్త ఫంగస్ జాతిని కనుగొన్న శాస్త్రవేత్తలు.. వాటికి ట్విటర్‌ను గుర్తుకు తెచ్చేలా ట్విటరీ అని పేరు పెట్టడమే ఇందుకు కారణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోపెన్‌హేగన్: ట్విటర్ అంటే అందరికీ సామాజిక మాధ్యమమే గుర్తుకు వస్తుంది. అయితే ఇకపై ఆ పరిస్థితి మారనుంది. ఇటీవల ఓ కొత్త ఫంగస్ జాతిని  కనుగొన్న శాస్త్రవేత్తలు.. వాటికి ట్విటర్‌ను గుర్తుకు తెచ్చేలా ట్విటరీ అని పేరు పెట్టడమే ఇందుకు కారణం. దీన్ని కనుగొనడంలో ట్విటర్ ఉపయోగపడటమే వారి నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను మైకోకీస్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అమెరికా జెర్రెలకు సంబంధించిన ఫోటోలను శాస్త్రవేత్తలు ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంటుండగా.. ఆ ఫోటోల్లోని ఓ జెర్రెపై మునుపెన్నడూ చూడని ఫంగస్‌ ఉండటాన్ని కోపెన్‌హేగన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు ఆనా సోఫియా గుర్తించారు. వెంటనే ఆమె ఈ విషయాన్ని తన సహోద్యోగుల దృష్టికి తెచ్చారు. దీనిపై మరింత పరిశోధన చేసేందుకు నిర్ణయించుకున్న వారు.. నేషనల్ హిస్టరీలోని జెర్రెల శాంపిళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో తాము ఓ కొత్త ఫంగస్ జాతిని కనుగొన్నామని వారికి అర్థమైంది. అయితే ట్విటర్ ద్వారానే తొలుత ఈ విషయం వెలుగులోకి రావడంతో వారు.. ఈ కొత్త ఫంగస్‌కు ‘ట్రోగ్లోమైసెస్ ట్విటరీ’ అని నామకరణం చేశారు. ఇది జెర్రెలు, ఇతర చిన్ని చిన్న కీటకాలపై దాడి చేస్తుందని వారు తెలిపారు.

Updated Date - 2020-05-17T00:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising