ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు యువతుల ప్రేమగాథ... పెద్దలను ఎదిరించి కోర్టులో పెళ్లి!

ABN, First Publish Date - 2020-09-10T12:42:26+05:30

స్వలింగ సంపర్కుల వివాహాలు ఇప్పుడు మహా నగరాలలోనే కాదు చిన్నపట్టణాలలోనూ జరుగుతున్నాయి. తాజాగా మరో స్వలింగ సంపర్కుల వివాహం బీహార్‌లోని బెతియాలో సంచలనంగా మారింది. ఇద్దరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెతియా: స్వలింగ సంపర్కుల వివాహాలు ఇప్పుడు మహా నగరాలలోనే కాదు చిన్నపట్టణాలలోనూ జరుగుతున్నాయి. తాజాగా మరో స్వలింగ సంపర్కుల వివాహం బీహార్‌లోని బెతియాలో సంచలనంగా మారింది. ఇద్దరు యువతులు వివాహం చేసుకున్నారు. వీరిద్దదరూ జలంధర్ కోర్టులో వివాహం చేసుకోగా, దీనికి ఆగ్రహం చెందిన ఒక యువతి కుటుంబ సభ్యులు ఆమెతో సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. ఈ ప్రేమ జంట తమను పెద్దలు వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. 


ఈ నేపధ్యంలో పోలీసులు ఆ యువతులకు కౌన్సెలింగ్ ఇప్పించి, వారిని ఇంటికి పంపించారు. వివరాల్లోకి వెళితే ఇస్రత్, నగ్మా అనే ఈ యువతులిద్దరూ తమ కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్‌లోని జలంధర్‌లో పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. ఈ నేపధ్యంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమను వారి ఇళ్లలోని పెద్దలు అంగీకరించకపోవడంతో వారు జలంధర్ కోర్టులో వివాహం చేసుకున్నారు. అయితే వారి ఇళ్లలోని పెద్దలు వీరి వివాహ బంధాన్ని అంగీకరించలేదు. ఇస్రత్ తన జీవిత భాగస్వామి నగ్మాతో పాటు ఉండటానికి ఇస్రత్ పుట్టింటివారు అంగీకరించలేదు. దీంతో ఇస్రత్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నగ్మా ఇంటికి వచ్చారు. నగ్మా కుటుంబ సభ్యులు ఆ యువతులిద్దరి వివాహ బంధాన్ని అంగీకరించారు. అలాగే వారు స్థానికులకు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.


Updated Date - 2020-09-10T12:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising