ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

80 వినూత్న ‘క్వారంటైన్ కేంద్రాలు’ నిర్మించిన గ్రామస్తులు.. సీఎం ప్రశంసలు..

ABN, First Publish Date - 2020-05-13T19:32:50+05:30

క్వారంటైన్ సదుపాయం కోసం ఓ గ్రామానికి చెందిన ప్రజలు 80 ప్రత్యేక గుడిసెలు నిర్మించి ప్రశంసలు అందుకుంటున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంఫాల్: క్వారంటైన్ సదుపాయం కోసం ఓ గ్రామానికి చెందిన ప్రజలు 80 ప్రత్యేక గుడిసెలు నిర్మించి ప్రశంసలు అందుకుంటున్నారు. కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్న తమ వారికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా వీటిలో సదుపాయం కల్పిస్తామని వారు చెబుతున్నారు. మణిపూర్‌లోని టుంజాయ్‌ గ్రామంలో పౌముయ్ తెగకు చెందిన ఈ ప్రజల క్రమశిక్షణ, కష్టించే పనిచేసే తత్వాన్ని చూసి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సైతం మురిసిపోయారు. ‘‘టుంజాయ్ గ్రామ పంచాయితీకి నా సెల్యూట్. రాష్ట్రం వెలుపల నుంచి రాబోతున్న తమ గ్రామస్తులకు క్వారంటైన్ సదుపాయం కోసం వీరంతా కలిసి ప్రత్యేకంగా 80 గుడిసెలు నిర్మించారు. ప్రతి గుడిసెలోనూ ఓ మంచం, ప్రత్యేక టాయిలెట్, గ్యాస్ టేబుల్, విద్యుత్ సదుపాయం, చార్జింగ్ సాకెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నీటి సరఫరాకి కూడా ఏర్పాటు చేశారు...’’ అని సీఎం ట్వీట్ చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో బస చేసే వారికి రేషన్ సరుకులు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. కాగా లాక్‌డౌన్‌తో తమ రాష్ట్రానికి చెందిన దాదాపు 40 వేల మంది ప్రజలు ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్నారనీ... వారిలో చాలామంది వెనక్కి తిరిగివచ్చేందుకు ఇష్టపడుతున్నారని సీఎం బీరేన్ సింగ్ పేర్కొన్నారు. 



Updated Date - 2020-05-13T19:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising