ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బనీను ధరించి విచారణలో పాల్గొన్న లాయర్.. షాక్‌లో జడ్జీ! ఆ తరువాత..

ABN, First Publish Date - 2020-04-26T01:32:21+05:30

బెయిల్ కేసు వాదించేందుకు వచ్చిన ఓ లాయర్ మాత్రం సోషల్ మీడియా మీమ్స్‌ను రుజువు చేస్తూ ఏకంగా బనీన్ ధరించి విచారణలో పాల్గొన్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: వర్క్ ఫ్రం హోం మొదలైన నాటి నుంచీ ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. లుంగీతో సెమినార్లలో పాల్గనడం, వంట చేస్తూ బాస్‌లో మీటింగ్ పెట్టడం లాంటి నేపథ్యాలతో ఎన్నో జోకులు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే అవన్నీ జోకులు మాత్రమే.. నవ్వుకోడానికే బాగుంటాయి. రీయల్ లైఫ్‌లో రిపీటైతే సీన్ వేరే రేంజ్‌లో ఉంటుంది.


తాజాగా రాజ్‌స్థాన్ హై కోర్టులో ఇటువంటి అరుదైన ఘటనొకటి జరిగింది. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరేన్సు ద్వారా కేసుల విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. లాయర్లు, కక్షిదారులు, ప్రతివాదులు ఇలా అందరూ ఈ విధానానికి అలవాటు పడ్డారు. అయితే ఇటీవల.. బెయిల్ కేసు వాదించేందుకు సద్ధమైన ఓ లాయర్ మాత్రం సోషల్ మీడియా మీమ్స్‌ను రుజువు చేస్తూ ఏకంగా బనీన్ ధరించి విచారణలో పాల్గొన్నాడు. దీంతో కేసును విచారిస్తున్న న్యాయమూర్తి సంజీవ్ ప్రకాశ్ శర్మ ఒక్కసారిగా షాకైపోయారు. సోషల్ మీడియలో సీన్..న్యాయస్థానంలో ఆవిష్కృతమడంతో న్యాయమూర్తి.. సదరు లాయర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పద్ధతి కాదని, కోర్టు మర్యాదలు అతిక్రమించకూడదని లాయర్‌ను మందలిస్తూ.. బెయిలు కేసును మే 5 తేదీకి వాయిదా వేసేశారు.


కరోనా లాక్ డౌన్ కారణంగా బాధితులకు న్యాయం అందడంతో జాప్యం ఎదురుకాకూడదని కోర్టులు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కేసుల విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో రాజస్థాన్ హైకోర్టు కూడా వీడియా కన్ఫరెన్సు ద్వారా విచారణ చేపట్టింది. ఈ నేపత్యంలోనే తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అక్కడ ఇలా జరగటం ఇది రెండో సారని తెలుస్తోంది.

Updated Date - 2020-04-26T01:32:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising