ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రి దాచుకున్న రూ. 16 లక్షలను పబ్‌జీ గేమ్‌ కోసం తగలేసిన కుమారుడు!

ABN, First Publish Date - 2020-07-04T01:48:06+05:30

‘పబ్‌జీ మొబైల్’ గేమ్ ఉచ్చులో పడిన ఓ టీనేజ్ కుర్రాడు తన తండ్రి బ్యాంకులో దాచుకున్న సొమ్ములోంచి ఏకంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: ‘పబ్‌జీ మొబైల్’ గేమ్ ఉచ్చులో పడిన ఓ టీనేజ్ కుర్రాడు తన తండ్రి బ్యాంకులో దాచుకున్న సొమ్ములోంచి ఏకంగా రూ. 16 లక్షలు ఖర్చు చేశాడు. పంజాబ్‌లో జరిగిందీ ఘటన. గేమ్‌లోని ‘ఇన్-యాప్’ కొనుగోళ్ల కోసం వైద్యం, ఇతర అవసరాల కోసం తన తండ్రి బ్యాంకులో దాచుకున్న సొమ్ములోంచి లక్షలాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు 


ఖరార్‌కు చెందిన 17 ఏళ్ల కుర్రాడు  తన పబ్‌జీ మొబైల్ అకౌంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మూడు బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును వాడేశాడు. తన టీం మేట్స్‌తో కలిసి ‘ఇన్‌యాప్’ కొనుగోళ్ల కోసం ఖర్చు చేశాడు. బ్యాంకు స్టేట్‌మెంట్లు చూసిన తర్వాత కానీ కుర్రాడి తల్లిదండ్రులకు ఖాతాలు ఖాళీ అయిన సంగతి తెలియరాలేదు. కుర్రాడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. అతడే తల్లితో కలిసి నివసిస్తుండగా,  తండ్రి ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు.


 ‘పబ్‌జీ మొబైల్’ అప్‌గ్రేడ్ కోసం తన తల్లి ఫోన్ నుంచి లావాదేవీలు చేసేవాడు. ఆ వెంటనే ఆ మెసేజ్‌లను డిలీట్ చేసేవాడని చెబుతూ తండ్రి బావురుమన్నాడు. స్మార్ట్‌ఫోన్‌ను అదే పనిగా ఉపయోగిస్తుంటే ఆన్‌లైన్ చదువు కోసమే అనుకున్నాం కానీ ఇంతపని చేస్తాడనుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై చదువు కోసం కూడా అతడికి మొబైల్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.   

Updated Date - 2020-07-04T01:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising