ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనా వార్డులో కానిస్టేబుల్ క‌ల‌క‌లం!

ABN, First Publish Date - 2020-05-24T14:14:10+05:30

మహారాష్ట్రలోని అకోలాలోగ‌ల‌ మెడికల్ కాలేజీలోని కరోనా బాధితుల వార్డులోకి ఒక పోలీసు రాక‌ కలకలం సృష్టించింది. ఆ పోలీసు కరోనా వార్డులోకి ప్రవేశించి, వీడియో తీయ‌డం ప్రారంభించాడు. అయితే అతను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అకోలా: మహారాష్ట్రలోని అకోలాలోగ‌ల‌ మెడికల్ కాలేజీలోని కరోనా బాధితుల వార్డులోకి ఒక పోలీసు రాక‌ కలకలం సృష్టించింది. ఆ పోలీసు కరోనా వార్డులోకి ప్రవేశించి, వీడియో తీయ‌డం ప్రారంభించాడు. అయితే అతను పీపీఈ కిట్ ధరించకుండా రావ‌డం ఆందోళ‌న‌క‌రంగా మారింది. వీడియో రికార్డింగ్ గురించి తెలియగానే వార్డు వెలుపల నిలబడిన భద్రతా సిబ్బంది ఆ పోలీసును ప్ర‌శ్నించారు. త‌రువాత వార్డు ఇన్‌చార్జి వైద్యుడు ఆ పోలీసును ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నావ‌ని అడిగారు. దీంతో ఆ పోలీసు త‌న‌ను ప్ర‌శ్నిస్తున్న డాక్టర్‌ను కూడా వీడియోలో బంధించాడు. దీంతో అక్క‌డున్న సిబ్బంది ఆ పోలీసు ద‌గ్గ‌రున్న ఫోను లాక్కొనేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో  వివాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం పోలీసుకు చెందిన‌ బంధువును వార్డులో చేర్చారు. ఈ నేప‌ధ్యంలోనే అత‌ను వీడియో తీశాడని తెలుస్తోంది. చివ‌రికి వైద్యాధికారుల జోక్యంతో ఆ పోలీసు తన ఫోనులోని వీడియోల‌ను వారికి అప్ప‌గించ‌డంతో స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింది. 

Updated Date - 2020-05-24T14:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising