ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6ఏళ్ల చిన్నారి గీసిన స్కెచ్‌తో పోలీసుల ఇన్వెస్టిగేషన్

ABN, First Publish Date - 2020-11-15T03:48:10+05:30

ఏదైనా కేసును ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీసులు దానికి సంబంధించిన ఊహాచిత్రాలను వినియోగించడం మామూలే. దానికోసం నిపుణులైన ఆర్టిస్ట్‌లతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెర్లిన్: ఏదైనా కేసును ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీసులు దానికి సంబంధించిన ఊహాచిత్రాలను వినియోగించడం మామూలే. దానికోసం నిపుణులైన ఆర్టిస్ట్‌లతో డ్రాయింగ్ వేయిస్తుంటారు. జర్మనీలోని హమ్ నగర పోలీసులు కూడా ఓ మహిళా డ్రైవర్‌ను పట్టుకునేందుకు ఇలాంటి స్కెచ్‌లనే వాడుతున్నారు. అయితే ఆ స్కెచ్‌లు ఏదో ప్రొఫెషనల్ గీసినవి కాదు. ఓ 6ఏళ్ల బాలుడు గీసినవి. అంతేకాదు.. ఆ చిన్నారి గీసిన చిత్రాలు కేసులో కీలక భాగమేనంటూ చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా తమ ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 


తమకు ఆ చిన్నారి గీసిచ్చిన చిత్రాలను తమ ట్వీట్‌కు జత చేశారు. ‘ఓ మహిళా డ్రైవర్ కావాలని రోడ్డు పక్కన ఉండే బ్యారియర్‌లను గుద్దేసి వెళ్లిపోయింది. ఆమెను పట్టుకునేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. అందుకే ఈ స్కెచ్‌లను కూడా వినియోగిస్తున్నాం. ఇవి ఆ సంఘటనను చూసిన ఓ 6ఏళ్ల బాలుడు గీసిన చిత్రాలు’ అంటూ పోలీసులు తమ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-11-15T03:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising