ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులు నా కొడుకును చంపాలి...వికాస్ దూబే తల్లి సరళాదేవి వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-07-04T12:57:59+05:30

కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాన నిందితుడైన గ్యాంగస్టర్ వికాస్ దూబే తల్లి సరళాదేవి తన రౌడీ కుమారుడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో (ఉత్తర్ ప్రదేశ్): కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాన నిందితుడైన గ్యాంగస్టర్ వికాస్ దూబే తల్లి సరళాదేవి తన రౌడీ కుమారుడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 8మంది పోలీసులను చంపి తన కుటుంబానికి అపఖ్యాతి తీసుకువచ్చిన తన కుమారుడు వికాస్ దూబేను పోలీసులు చంపాలని సరళాదేవి కోరారు. పోలీసులను చంపిన తన కుమారుడిని పట్టుకోగలిగినా అతన్ని చంపమని కోరుతున్నానని సరళాదేవి పేర్కొన్నారు. తన కుమారుడైన వికాస్ దూబేకు కఠినమైన శిక్ష విధించాలని ఆమె సూచించారు.

‘‘అమాయక పోలీసులను చంపడం ద్వారా అతను చాలా చెడ్డ పని చేశాడు. నేను టీవీలో ఎన్‌కౌంటర్ వార్తలను చూశాను. అతడు తన మంచి కోసం బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోవాలని నేను కోరుకుంటున్నాను, లేకపోతే పోలీసులు అతన్ని ఎలాగైనా కనుగొంటారు. అతన్ని పట్టుకొని ఆపై ఎన్‌కౌంటర్ చేయండి. నా కుమారుడిని శిక్షించాలి’’ అని వికాస్ దూబే తల్లి సరళాదేవి కోరారు. వికాస్ దూబేకు రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడిన తర్వాత నేర ప్రపంచంలో చేరాడని సరళాదేవి చెప్పారు.


ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచేందుకు వికాస్ దూబే మం్తరి సంతోష్ శుక్లాను కాల్చి చంపాడని సరళాదేవి పేర్కొన్నారు. ‘‘వికాస్ దూబే మా కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తున్నాడు, నేను గత 4 నెలలుగా అతన్ని కలవలేదు. నేను నా చిన్న కొడుకుతో కలిసి లక్నోలో నివశిస్తున్నాను. వికాస్ వల్ల మేం , మా కుటుంబసభ్యులు ఇబ్బంది పడుతున్నాం’’ అని సరళాదేవి వివరించారు. వికాస్ దూబే సమాచారం ఇచ్చిన వారికి రూ.50వేల నగదు రివార్డు ఇస్తామని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ ప్రకటించారు. 

Updated Date - 2020-07-04T12:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising