ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎం చొరవతో 3 గంటల్లో మారిన ప్రీతి జీవితం!

ABN, First Publish Date - 2020-10-28T13:19:27+05:30

ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ఆగ్రాకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రా: ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ఆగ్రాకు చెందిన ప్రీతి తన ఇల్లు కూలిపోయిన విషయాన్ని తెలియజేసింది. దీంతో డీఎం ప్రభు ఎన్ సింగ్ మూడు గంటల్లో ఆమె ఇంటికి చేరుకుని, ఇంటి మరమ్మతు కోసం రెండు లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ప్రీతి మాట్లాడుతూ ప్రభుత్వం తన సమస్యను ఇంత త్వరగా పరిష్కరిస్తుందని ఊహించలేకపోయానని తెలిపింది. దీనికి ముందు ప్రీతి తనకు స్వనిధి పథకం కింద సహాయం చేయాలని పీఎంను కోరింది.



వివరాల్లోకి వెళితే యూపీలోని రెహడీ పటరీలోని దుకాణదారులకు సహాయం అందించేందుకు ప్రదానమంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ పథకానికి చెందిన లబ్ధిదారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. దీనిలో ముందుగా శిల్పాగ్రామ్‌లో పండ్ల దుకాణం నిర్వహించే తాజ్‌గంజ్ నివాసి ప్రీతితో మోదీ సంభాషించారు. ఏడు నిముషాలపాటు సాగిన ఈ సంభాషణలో ప్రీతి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని తెలుసుకున్నారు. తరువాత స్వనిధి పథకం ద్వారా అందే లబ్ధి గురించి తెలిపారు. ఈ సందర్భంగా ప్రీతి తమ ఇల్లు కూలిపోయిన విషయం తెలియజేసింది. తన భర్త పనిచేయలేని స్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే మోదీ ఆమె సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇది జరిగిన 3 గంటలలో ప్రీతి ఇంటికి డీఎం వచ్చి, వారి ఇంటి మరమ్మతు కోసం 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. 

Updated Date - 2020-10-28T13:19:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising