ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాదిలోనే అతిపెద్ద చందమామ.. ఎప్పుడు కనిపిస్తుందంటే..

ABN, First Publish Date - 2020-04-08T02:50:21+05:30

ఈ ఏడాదిలో కనిపించే అతిపెద్ద చందమామ.. ‘పింక్ సూపర్ మూన్’ కనిపించేది ఈ నెలలోనేనట. అదీ ఎప్పుడో తెలుసా? బుధవారం ఉదయం 8.గంటల సమయంలో. ఈ నెలలో సంభవించే అంతరిక్ష అద్భుతాల్లో ఇదీ ఒకటి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో కనిపించే అతిపెద్ద చందమామ.. ‘పింక్ సూపర్ మూన్’ కనిపించేది ఈ నెలలోనేనట. అదీ ఎప్పుడో తెలుసా? బుధవారం ఉదయం 8.గంటల సమయంలో. ఈ నెలలో సంభవించే అంతరిక్ష అద్భుతాల్లో ఇదీ ఒకటి.  పూర్ణచంద్రుడు కనిపించే పౌర్ణమి రోజున చందమామ భూమికి దగ్గరగా వస్తే దాన్నే సూపర్ మూన్ అంటారు. బుధవారం ఉదయం భూమి, చందమామ మధ్య దూరం 3,57,085 కిలోమీటర్లు ఉంటుందని నాసా అంచనా. సాధారణంగా ఈ దూరం 3,84,000 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఈ రెండిటి మధ్య దూరం దాదాపు 27వేల కిలోమీటర్లు తగ్గుతుందన్నమాట. దీనివల్ల మనకు కనిపించే ఈ ‘పింక్ సూపర్‌మూన్’ సాధారణంగా కనిపించే పున్నమి చంద్రుడి కన్నా 14శాతం పెద్దగా, 30శాతం కాంతివంతంగా కనిపిస్తాడట. ఈ ఏడాదిలో కనిపించే చందమామల్లో ఇదే అత్యంత పెద్దది, కాంతివంతమైనది అని నిపుణులు చెప్తున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటాక, ఆ తర్వాత మళ్లీ బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో ఈ పింక్ సూపర్‌మూన్ మన కంటపడనుంది.


దీన్ని పింక్ సూపర్ మూన్ అనడానికి ఓ కారణముందండోయ్. అదేంటంటే ఈ నెలలో వైల్డ్ గ్రౌండ్ ఫియాక్స్ ఫ్లవర్స్ (పింక్ రంగులోని గడ్డిపూల వంటివి) పూస్తాయి. అందుకే ఈ నెలలో వచ్చే సూపర్‌మూన్‌ను ‘పింక్ సూపర్‌మూన్’ అంటారు. ఇలా నెలకోసారి కనిపించే ప్రతి పున్నమి చంద్రుడికీ ఒక్కో పేరుంటుంది.

Updated Date - 2020-04-08T02:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising