ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతా.. కరోనా మహత్యం! సంబరపడుతున్న జూ పార్క్ అధికారులు!

ABN, First Publish Date - 2020-04-08T01:50:03+05:30

కరోనా మహమ్మారి భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కుటుంబసభ్యులందరూ ఇంటి పట్టునే ఉండటంతో వారి మధ్య బంధాలు బలపడుతున్నాయి. జంటల మధ్య ప్రేమలు మళ్లీ చిగురిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి కేవలం మనుషులకే పరిమితం కాలేదు. కరోనా పుణ్యమా అని ప్రస్తుత పరిస్థితుల్లో జూలల్లోని జంతువులు కూడా ఒక్కటవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాంకాంగ్: కరోనా మహమ్మారి భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కుటుంబసభ్యులందరూ ఇంటి పట్టునే ఉండటంతో వారి మధ్య బంధాలు బలపడుతున్నాయి. జంటల మధ్య ప్రేమలు చిగురిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి కేవలం మనుషులకే పరిమితం కాలేదు. కరోనా పుణ్యమా అని ప్రస్తుత పరిస్థితుల్లో జూలల్లోని జంతువులు కూడా ఒక్కటవుతున్నాయి. హాంకాంగ్ జూలో ఇటువంటి అరుదైన దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది. అక్కడ యింగ్ యాంగ్-లీలీ అనే పాడ జంట.. దాదాపు పదేళ్ల తరువాత ఒక్కటైంది. ఇంతకాలం జూలోని డాక్టర్లు ఎంత ప్రయత్నించినా వాటిని ఒక దగ్గరకు చేర్చలేక పోయారు. అసలే..పాండాల్లో పునరుత్పత్తి చాలా తక్కువ. దీనితోడు.. జూలో నిత్యం వచ్చి పోయే సందర్శకుల కారణంగా పాండా జంట మధ్య మరింత దూరం పెరిగింది. అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో అక్కడ సందర్శకుల రాక పూర్తిగా నిలిచిపోయింది. ఆ విధంగా ఏర్పడిన నిశ్శబ్దం.. పాండా జంటను ఒక్కటి చేసింది. ఇది చూసిన జూ అధికారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తమ ఆనందాన్ని వారు సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో పంచుకున్నారు. ‘2007లో యింగ్ యాంగ్, లీలీ జంట ఇక్కడకు వచ్చింది. 2010 నుంచి వాటిని ఒక్కటి చేయాలన్న మా ప్రయత్నాలు ఇన్నాళ్లకు ఓ కొలిక్కివచ్చాయి’ అని ఓషియన్ పార్క్ అధికారి మైఖేల్ బూస్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-04-08T01:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising