ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికుల కోసం 99 ఏళ్ల బామ్మ ఏం చేసిందంటే.. వైరల్ అవుతున్న వీడియో

ABN, First Publish Date - 2020-05-30T23:12:47+05:30

కరోనా లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. వారిని ఆదుకునేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. వారిని ఆదుకునేందుకు అనేక మంది సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ 99 ఏళ్ల బామ్మ కూడా వారికి సాయం చేయాలనుకున్నారు. వారి ఆకలి తీర్చాలనుకున్నారు. దానికోసం చపాతీలను సిద్ధం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌కు చెందిన ఓ లాయర్ ఈ వీడియోను తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ‘వలస కూలీల ఆకలి తీర్చేందుకు మా ఆంటీ చపాతీలు సిద్ధం చేస్తున్నారు’ అంటూ ఈ వీడియోకు కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో ఓ బామ్మ చపాతీలను అల్యుమీనియం ఫాయిల్‌లో ప్యాక్ చేసి పక్కనే ఉన్న ప్లేట్‌లో పెడుతుంటారు.


ఈ వీడియోను చూసిన నెటిజన్ల ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంత మంచి మనసు ఉన్న ఆమెకు భగవంతుడు మరింత ఆయుష్షు అందించాలని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. మరి కొందరు పాకీస్తాన్‌లో ఉన్న వ్యక్తి ముంబైలో ఉన్న వ్యక్తి గురించి ఇంత మంచి వీడియో పోస్ట్ చేయడం సంతోషకరమని, ఇరు దేశాలు కూడా ఇదే స్థాయిలో కలిసి మెలిసి ఉంటే బాగుంటుందని కామెంట్ చేశారు.

Updated Date - 2020-05-30T23:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising