ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్ట కాపాడిన ప్రాణం.. ఫోటో వైరల్

ABN, First Publish Date - 2020-08-14T01:34:36+05:30

ఊబకాయం ప్రాణానికే ప్రమాదం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చైనాలోని ఓ వ్యక్తి ప్రాణం మాత్రం ఈ ఊబకాయమే కాపాడింది. చైనాలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: ఊబకాయం ప్రాణానికే ప్రమాదం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చైనాలోని ఓ వ్యక్తి ప్రాణం మాత్రం ఈ ఊబకాయమే కాపాడింది. చైనాలో కొంతమంది తమ ఇళ్లముందు బావులను తవ్వుకుంటారు. అయితే అవి మన దేశంలోలా పెద్దపెద్దవి ఉండవు. చిన్న మూతితో ఓ రెండడుగుల వెడల్పులో ఉంటాయంతే. తమ అవసరాలకు ఇందులోని నీటిని వినియోగించుకుంటుంటారు. అయితే చైనాలోని లియూ అనే వ్యక్తి కూడా తన ఇంటి ముందు ఓ చిన్న బావిని నిర్మించుకున్నాడు. దానిపై ఉన్న చెక్క మూతపై లియూ నిలబడడంతో ఆ చెక్క విరిగిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో లియూ బావిలో పడిపోయాడు. కానీ సగం మాత్రమే. లియూకు ఊబకాయం ఉండడంతో బావిలో పట్టలేదు. దీంతో పోట్ట నుంచి పై భాగం బావిపైనే ఉండగా.. కింది భాగం మాత్రం బావిలో వేలాడసాగింది. దీంతో ఫైర్ సిబ్బందికి విషయం తెలియజేయగా వారు వచ్చి అతికష్టంమీద లియూను బయటకు లాగారు. లియూకు ఊబకాయంతో ఉండడం వల్లే అతడు లోనికి పడిపోలేదని, అయితే బయటకు తీయడానికి కొంత కష్టపడినా ఎటువంటి గాయాలు లేకుండా కాపాడగలిగామని ఫైర్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2020-08-14T01:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising