ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్‌హోల్ వీడియో షేర్ చేసిన నాసా.. విశేషం ఏంటంటే..

ABN, First Publish Date - 2020-05-31T21:49:13+05:30

ఓ బ్లాక్‌హోల్‌కు సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇటీవల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఓ బ్లాక్‌హోల్‌కు సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇటీవల విడుదల చేసింది. దాదాపు కాంతి వేగంతో ఉష్ణ పదార్థాన్ని వెలువరిస్తూ వెలిగిపోతున్న వెలుగు విరజిమ్ముతున్న ఈ కృష్ణబిలాన్ని నాసాకు చెందిన కొందరు అంతరిక్షపరిశోధకులు గుర్తించి వీడియో తీశారు. ఇందులో దాదాపు సూర్యుడికంటే దాదాపు 8 రెట్లు ద్రవ్యరాశి కలిగి ఉన్న ఓ బ్లాక్‌‌హోల్ కనిపిస్తుంది. ఈ బ్లాక్‌హోల్ తన గురుత్వాకర్షణ బలంతో పక్కన ఉన్న ఓ నక్షత్రంలోని పదార్థాన్ని వేగంగా తనవైపు ఆకర్షిస్తోంది. ఇలా వచ్చిన పదార్థమంతా ఆ బ్లాక్‌హోల్ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ అంతకంతకూ పెరుగుతోంది.


ఈ నేపథ్యంలో నక్షత్రం నుంచి సేకరించిన పదార్థంలో కొంత పదార్థాన్ని బ్లాక్‌హోల్ తన కేంద్ర భాగం నుంచి రెండు వైపులా బయటకు విడుదల చేస్తోంది. ఇలా బయటకు వస్తున్న పదార్థం అత్యంత ఉష్ణోగ్రతతో దాదాపు 80 శాతం కాంతి వేగంతో విడుదలవుతోంది. దీని ద్వారా బ్లాక్‌హోల్స్‌కు సంబంధించిన మరింత సమాచారం తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - 2020-05-31T21:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising