ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాసాకే విసుగు తెప్పించిన చీపురు ట్రిక్! ఇక చాలు ఆపండి అంటూ..

ABN, First Publish Date - 2020-02-13T02:08:11+05:30

నాసాకు విసుగు పుట్టించిన చీపురు ఛాలెంజ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సోషల్ మీడియా అంటే అంతే.. నిత్యం ఏదో ఒక ఛాలెంజ్ హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఐస్ బకెట్ ఛాలెంజ్.. ఆ తరువాత కికీ ఛాలెంజ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి. తాజాగా చీపురు ఛాలెంజ్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. చీపురు ఛాలెంజ్ అంటే నేల మీద చీపురును నిట్టనిలువుగా నిలబెట్టడమన్నమాట. దాన్ని నేల మీద నిలబెడితే దానంతట అదే ఎటువంటి ఆసరా లేకుండా నిటారుగా నిలబడిపోతుందట.


అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఫిబ్రవరి 10న తప్ప ఇంకెప్పుడూ ఈ ట్రిక్ చేయడం సాధ్యం కాదనే ఓ వదంతి వైరల్ అవడంతో జనాలు ఆ రోజు విరగబడి ఈ ట్రిక్‌ను ట్రై చేశారు. ఇది సాక్షాత్తూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసాయే చెప్పిందన్న వార్త నెటిజన్లను కుదురుగా ఉండనీయలేదు. ఆ రోజున భూమి గురుత్వాకర్షణ శక్తి చీపుళ్లను ఇలా నిలబెడుతుందని నాసా చెప్పిందనే వార్తను నెటిజన్లు బలంగా నమ్మారు. మేమూ ఈ ట్రిక్ చేశామంటూ వీడియోలు పోస్ట్ చేశారు. సరిగ్గా ఇదే నాసాకు విసుగుతెప్పించింది. ‘ఫిబ్రవరి 10నే కాకుండా ఏడాది పొడవునా ఇలా చేయొచ్చు. చీపురు చివరన బ్రిజిల్స్ కాస్త గట్టిగా ఉంటే చాలు.. ఇక చాలు ఆపండి’ అంటూ ట్వీట్ చేసింది. గురుత్వాకర్షణ శక్తి వల్ల చీపురు నిలబడిందని చెప్పే వార్తలన్నీ ట్రాష్ అంటూ ఈ లొల్లికి ఫుల్‌స్టాప్ పెట్టింది.  

Updated Date - 2020-02-13T02:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising