ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈగను చంపబోయి కిచెన్‌ను తగలబెట్టుకున్నాడు!

ABN, First Publish Date - 2020-09-08T22:56:20+05:30

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో ఈగ చేసే విన్యాసాలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్రాన్స్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో ఈగ చేసే విన్యాసాలు, ఈగ కారణంగా విలన్ పాత్రధారి సుదీప్ ఎదుర్కొనే కష్టాలు, ఈగను చంపేందుకు అతడు పడే యాతన ఆకట్టుకుంటాయి. ఈగను అంతమొందించే ప్రయత్నంలో అతడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటాడు. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుంటాడు. చివరికి దాని చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. అయితే, అది సినిమా. ఇంచుమించు ఇలాంటి ఘటనే ఒకటి ప్రాన్స్‌లోని పార్కౌల్-చెనౌడ్ అనే చిన్న గ్రామంలో జరిగింది. అయితే, ఈ ఘటనలో మాత్రం బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 


82 ఏళ్ల వ్యక్తి రాత్రి భోజనానికి కూర్చున్నాడు. నోట్లో ముద్ద పెట్టుకుంటున్న సమయంలో ఓ ఈగ అతడిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. దానిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ఎంతగా ప్రయత్నించినా అది వెళ్లకపోగా, అతడిని మరింత అసహనానికి గురిచేసింది. దీంతో విసిగిపోయిన అతడు భోజనాన్ని అక్కడే వదిలేసి దానిని చంపేందుకు ఎలక్ట్రిక్ బ్యాట్ పట్టుకుని దాని వెనక పడ్డాడు. ఆ ఈగ ఇల్లంతా తిరుగుతూ అతడిని ఇబ్బంది పెట్టి చివరికి వంటిట్లో దూరింది. అయితే, అప్పటికే గ్యాస్ లీకవుతుండడాన్ని అతడు గమనించలేకపోయాడు. 


దీంతో బ్యాట్ పట్టుకుని అతడు కూడా ఈగ వెనకే వంటింట్లో దూరాడు. అంతే, ఎలక్ట్రిక్ బ్యాట్ కావడంతో గ్యాస్ రియక్షన్ జరిగి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి వంటగది మొత్తం ధ్వంసమైంది. అంతేకాదు, ఇంటి పైకప్పు కూడా స్వల్పంగా దెబ్బతింది. అయితే, బాధిత వ్యక్తి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే, అతడు చంపాల్సిన ఈగ ఆ మంటల్లో కాలి బూడిదైందా? లేక, తప్పించుకుందా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు.   


Updated Date - 2020-09-08T22:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising