ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్: మనసుకు నచ్చచెప్పుకోలేక పర్వతాలనెక్కి లోయలో పడి చివరికి..

ABN, First Publish Date - 2020-04-07T00:56:19+05:30

రోనా వైరస్ ప్రేరేపిత లాక్ డౌన్ కారణంగా మద్యం, సిగరెట్లు వంటి వ్యసనాల బారిన పడ్డ వారి పరిస్థితి ఘోరంగా మారుతోంది. వ్యసనానికి బానిసైన కొందరు తమపై తాము అదుపుకోల్పోయి నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఒక్కోసారి ప్రమాదాన్ని కూడా కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన వ్యక్తికి లాక్ డౌన్ కారణంగా సిగరెట్లు దొరకకపోవడంతో అతడు ఏకంగా పక్క దేశం బాట పట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారిస్: కరోనా వైరస్ ప్రేరేపిత లాక్ డౌన్ కారణంగా మద్యం, సిగరెట్లు వంటి వ్యసనాల బారిన పడ్డ వారి పరిస్థితి ఘోరంగా మారుతోంది. వ్యసనానికి బానిసైన కొందరు తమపై తాము అదుపుకోల్పోయి నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఒక్కోసారి ప్రమాదాన్ని కూడా కొని తెచ్చుకుంటున్నారు.  తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన వ్యక్తికి లాక్ డౌన్ కారణంగా సిగరెట్లు దొరకకపోవడంతో అతడు ఏకంగా పక్క దేశం బాట పట్టాడు. తన ఊరు నుంచి స్పెయిన్‌కు కారులో బయలు దేరాడు. అయితే ఓ చెక్ పోస్ట్ దగ్గర అధికారులు అతడిని ఆపి వెనక్కుపంపించేశారు. అయితే సిగరెట్లపై యావతో అతడు ఏకంగా పైరీన్స్ అనే పర్వతశ్రేణులు ఎక్కి పొరుగు దేశంలోకి చొరబడాలకున్నాడు.


అనుకున్నదే తడవుగా అంతా సిద్ధం చేసుకుని పర్వతసానువుల్లో ప్రయాణం ప్రారంభించాడు. కానీ కొంత దూరం వెళ్లాక అతడు దారి తప్పడమే కాకుండా పక్కనే ఉన్న ఓ లోయలోకి పడిపోయాడు. దిక్కుతోచని స్థితిలో అత్యవసర సిబ్బంది సహాయాన్ని అర్థించాడు. వారు అతడిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తరువాత.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అతడిపై 120 యూరోల జరిమానా విధించారు. అయితే అతడి పేరు ఇతర వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. 

Updated Date - 2020-04-07T00:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising