ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వాలంటైన్స్ డే’న అమరావతి గర్ల్స్ స్కూల్లో ప్రతిజ్ఞ.. వీడియో వైరల్..!

ABN, First Publish Date - 2020-02-14T21:14:01+05:30

ఫిబ్రవరి 14వ తేదీ రాగానే ప్రేమికుల సందడి, పార్కుల్లో భజరంగదళ్ హడావుడి కనిపించడం సహజం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిబ్రవరి 14వ తేదీ రాగానే ప్రేమికుల సందడి, పార్కుల్లో భజరంగదళ్ హడావుడి కనిపించడం సహజం. అయితే.. మహారాష్ట్రలోని అమరావతి పరిధిలో తాజాగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ గర్ల్స్ స్కూల్‌లో బాలికలతో ఆ స్కూల్ సిబ్బందిలోని ఒకరు వాలంటైన్స్ డేన చేయించిన ప్రతిజ్ఞ వైరల్‌గా మారింది. ‘మేము ఎవరినీ ప్రేమించం.. ప్రేమ వివాహం చేసుకోం’ అని బాలికలతో ఆ వ్యక్తి ప్రతిజ్ఞ చేయించాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.


45 సెకన్ల నిడివితో కూడిన ఈ వీడియోను వినోద్ అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఆ రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చిత్ర వాఘ్, బీజేపీ నేత పంకజ ముండే, విద్యా శాఖ మంత్రి వర్ష గైక్వాడ్, స్థానిక ఎమ్మెల్యే ఉదయ్ సామంత్‌ ట్విట్టర్‌ ఖాతాలకు ట్యాగ్ చేశాడు. దీంతో.. ఈ ఘటనపై బీజేపీ నేత పంకజ ముండే స్పందించారు. చింతూరు ప్రాంతంలోని స్కూల్లో ఈ ఘటన జరిగిందని, ఇది హాస్యాస్పదమని.. కేవలం బాలికలు మాత్రమే ఎందుకు ప్రతిజ్ఞ చేయాలని ఆమె తన ట్వీట్‌లో ప్రశ్నించారు.

Updated Date - 2020-02-14T21:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising