ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వింత చోరీ: పూజలు చేసి, దక్షిణలు సమర్పించి...

ABN, First Publish Date - 2020-10-18T17:35:11+05:30

రాత్రి 12 గంటల సమయంలో ఒక దొంగ ఆలయంలోకి చొరబడ్డాడు. దేవతా విగ్రహాల ముందు నిలుచుని ప్రార్థనలు చేశాడు. హుండీలో డబ్బులు వేశాడు. తరువాత హుండీ తాళం పగులగొట్టి, దానిలోని సొమ్మునంతా తీసుకుని పరారయ్యాడు. ఉదయం పూజారులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాత్రి 12 గంటల సమయంలో ఒక దొంగ ఆలయంలోకి చొరబడ్డాడు. దేవతా విగ్రహాల ముందు నిలుచుని ప్రార్థనలు చేశాడు. హుండీలో డబ్బులు వేశాడు. తరువాత హుండీ తాళం పగులగొట్టి, దానిలోని సొమ్మునంతా తీసుకుని పరారయ్యాడు. ఉదయం పూజారులు ఆలయం తెరిచారు. దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. 


వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువనమియుర్‌లోని మరుండేశ్వర్ ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయంలోగల సీసీటీవీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీనిని పరిశీలించిన పోలీసు అధికారులు మాట్లాడుతూ ఒక యువకుడు మాస్క్ ధరించి, ఆలయంలోకి ప్రవేశించాడని, దేవతా మూర్తుల ముందు నిలుచుని, ప్రార్థనలు చేశాడని తెలిపారు. తరువాత ఒక రాడ్ సాయంలో హుండీని పగులగొట్టి, దానిలోని సొమ్మును తీసుకుని పరారయ్యాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-10-18T17:35:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising