ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధుల్లో పెరుగుతున్న కాలేయ కేన్సర్‌ ముప్పు

ABN, First Publish Date - 2020-03-24T09:47:12+05:30

వృద్ధులకు కాలేయ కేన్సర్‌ ముప్పు పెరుగుతోందని చైనాలోని ఫుడాన్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, మార్చి 23 : వృద్ధులకు కాలేయ కేన్సర్‌ ముప్పు పెరుగుతోందని చైనాలోని ఫుడాన్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. 1990-2017 మధ్యకాలంలో 195 దేశాల్లో కాలేయ కేన్సర్‌ బారినపడిన స్త్రీ, పురుషుల గణాంకాలను వయసులవారీగా విభజించి విశ్లేషించగా ఈవిషయం తెలిసింది. 1990 సంవత్సరంలో ఆ వ్యాధి పంజాకు చిక్కిన వృద్ధుల సంఖ్య 2,16,561 కాగా.. 2017లో అది పెరిగి 2,41,189కి చేరిందని గుర్తించారు. ఇదేకాలానికి కాలేయ కేన్సర్‌ నిర్ధారణ అయిన 30 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా తగ్గి 17,381 నుంచి 14,661కి చేరింది. హెపటైటి్‌స-బి వైరస్‌ కారణంగానూ ఈ వ్యాధి వస్తుంటుంది. యువతలో చాలామందికి బాల్యంలో చేయించిన హెపటైటి్‌స-బి వ్యాక్సినేషన్‌ రక్షణ కవచంగా పనిచేసి కాలేయ కేన్సర్‌ రాకుండా అడ్డుకుంటోందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

Updated Date - 2020-03-24T09:47:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising