ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 ఏళ్ల పాటు లివ్‌ఇన్... పెళ్లికి సిద్ధమైన 73 ఏళ్ల వరుడు, 67 ఏళ్ల వధువు!

ABN, First Publish Date - 2020-02-17T16:46:28+05:30

ప్రేమకు వయసుతో సంబంధం ఉండదంటారు. అయితే ఒక జంట తమ సుదీర్ఘ ప్రేమకు కాలంతో పాటు, వయసు కూడా అడ్డంకి కాదని నిరూపించారు. వయసు మీద పడ్డాక పెళ్లికి పెళ్లి చేసుకున్నారు. వీరి విచిత్ర వివాహం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవర్థ్: ప్రేమకు వయసుతో సంబంధం ఉండదంటారు. అయితే ఒక జంట తమ సుదీర్ఘ ప్రేమకు కాలంతో పాటు, వయసు కూడా అడ్డంకి కాదని నిరూపించారు. వయసు మీద పడ్డాక పెళ్లికి పెళ్లి చేసుకున్నారు. వీరి విచిత్ర వివాహం ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌థామ్ జిల్లాలోని ఖైర్జిటీ కాలా గ్రామంలో జరిగింది. గత 50 ఏళ్లుగా పెళ్లి చేసుకోకుండానే కలసి జీవిస్తున్నవీరు ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. శుకల్ నిషాద్(73), గౌతర్‌హిన్ బాయి(67)లు తమ పిల్లల కోరిక మేరకు సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి గ్రామానికి చెందినవారంతా హాజరయ్యారు. శుకల్ నిషాద్, గౌతర్‌హిన్ బాయిల లివ్ ఇన్ వెనుక ఒక ఆసక్తికర కథనం ఉంది. శుకల్ తనకు పెళ్లి వయసు వచ్చాక అమ్మాయిని చూసేందుకు బిర్సింగి గ్రామానికి వెళ్లాడు. అక్కడ శుకల్ తాను చూడాలనుకున్న అమ్మాయిని కాకుండా ఆమె చెల్లెలిపై మనసు పడ్డాడు. తరువాత వారిద్దరూ పరిచయాలు పెంచుకుని కలిసివుండసాగారు. అందుకు గ్రామస్తులెవరూ కూడా అభ్యంతరం చెప్పలేదు. దీంతో వివాహం అవసరం లేకుండానే 50 ఏళ్లు లివ్‌ ఇన్‌లో ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఎనిమిది మంది మనుమలు. ఇప్పడు వీరందరి సమక్షంలో శుకల్ నిషాద్, గౌతర్‌హిన్ బాయి వివాహం చేసుకున్నారు. 



Updated Date - 2020-02-17T16:46:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising