ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో.. ఇంత పొడవైన ఇల్లా...

ABN, First Publish Date - 2020-07-05T17:27:57+05:30

ముంబైలో ఉన్న అంబానీ ఇల్లు చూసే మనం ‘వామ్మో ఎంత పెద్దదో’ అని నోరెళ్ల బెట్టాం. అంతకు పదింతలు ఉన్న ఇల్లు ఆస్ట్రియాలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబైలో ఉన్న అంబానీ ఇల్లు చూసే మనం ‘వామ్మో ఎంత పెద్దదో’ అని నోరెళ్ల బెట్టాం. అంతకు పదింతలు ఉన్న ఇల్లు ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. 


ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ‘కార్ల్‌ మార్క్స్‌ హాఫ్‌’ అనే నివాస సముదాయం. ప్రపంచంలో ఇదే అతి పెద్ద ఇల్లుగా చెప్పుకుంటారు. ఈ ఇల్లు చూడాలంటే కనీసం అరగంట సమయం పడుతుంది. ఎందుకంటే ఈ ఇల్లు మొత్తం కిలోమీటరు విస్తీర్ణంలో విస్తరించి ఉంది.


దీన్ని 1927లో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత చాలా మంది ప్రజలు నివాసాన్ని కోల్పోయారు. వారికి ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఇల్లును కట్టుకుంటూపోయారు. 


లోపల గదులు విడివిడిగా ఉన్నప్పటికీ, అన్నీ పెద్ద భవంతిలోనే ఉన్నట్టు నిర్మించారు. అంటే పైకప్పు ఒక్కటే కానీ... లోపల గోడలతో ఇళ్లను విభజించారు. లోపల మొత్తం 1382 నివాసాలు ఉన్నాయి.


లోపల ట్రామ్‌ వాహనాలు ఆగేందుకు నాలుగు  స్టేషన్లు ఉన్నాయి. ప్రజలు అందులోనే ఎక్కి భవంతి పరిసరాల నుంచి బయటికి వస్తారు. 


లోపల ఆసుపత్రి దగ్గర నుంచి స్కూలు వరకు సకల సదుపాయాలు ఉన్నాయి. అదొక చిన్నప్రపంచమనే చెప్పుకోవాలి. 


12వ శతాబ్ధంలో ఈ భవంతి కట్టిన చోట సరస్సు ఉండేది. తరువాత దాన్ని కప్పేసి నివాసస్థలంగా మార్చారు. 

Updated Date - 2020-07-05T17:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising