ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి కోసం వాటర్ ట్యాంకర్‌ను ఆపిన ఏనుగు!

ABN, First Publish Date - 2020-11-16T16:34:11+05:30

ఆ గజరాజుకు విపరీతంగా దాహమేసింది. ఇంతలో అటుగా ఒక వాటర్ ట్యాంకర్ వచ్చింది. దానిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్లారి: ఆ గజరాజుకు విపరీతంగా దాహమేసింది. ఇంతలో అటుగా ఒక వాటర్ ట్యాంకర్ వచ్చింది. దానిని చూసిన ఏనుగు ఆ వాటర్ ట్యాంకర్‌ను ఆపి, నేరుగా తొండాన్ని ట్యాంకర్‌లో పెట్టి నీటిని గటా గటా తాగేసింది. అక్కడున్నవారంతా దీనిని వింతగా చూశారు. ఈ ఉదంతం కర్నాటకలోని హంపిలో జరిగింది. బళ్లారిలో హంపి ఉత్సవాలు జరిగాయి. వీటిని విజయ ఉత్సవాలు అని కూడా పిలుస్తారు. ఈ ఉత్సవాల సమయంలో ఏనుగులను ఊరేగిస్తారు.


ఈ నేపధ్యంలో గుంపులోని ఒక ఏనుగుకు దాహమేసింది. అటుగా వెళుతున్న వాటర్ ట్యాంకర్‌ను ఆపింది. దీంతో ఆ వాటర్ ట్యాంకర్ ఉన్న నడుపుతున్న డ్రైవర్ భయపడ్డాడు. అయితే ఆ ఏనుగు ట్యాంకర్ మూత వైపు చూడడంతో, దానికి దాహమేసిందని డ్రైవర్‌కు అర్ధమైంది. ఇంతలో ట్యాంకర్ మూతను తీయాలని అక్కడే ఉన్న మంత్రి ఆనంద్ సింగ్ కుమారుడు సిద్ధార్థ్  డ్రైవర్‌కు సూచించారు. ట్రాక్టర్‌పై నున్న వ్యక్తి ట్యాంకర్ మూత తీయడంతో, ఆ ఏనుగు తన తొండాన్ని ట్యాంకర్‌లో పెట్టి నీటిని తాగింది. తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయి, ఊరేగింపు ఉత్సవంలో పాల్గొంది. 

                                               ‘న్యూస్ బెంగళూరు’ సౌజన్యంతో...


Updated Date - 2020-11-16T16:34:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising