ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫొటోగ్రాఫర్‌కు ఊహించని అనుభవం.. క్రైమ్ సీన్‌లో ఫొటో తీస్తుండగా..

ABN, First Publish Date - 2020-07-15T00:01:32+05:30

కేరళలోని ఎర్నాకులంలో టామీ థామస్ అనే వ్యక్తి ఫొటోగ్రాఫర్. శివదాసన్ అనే వ్యక్తి ఇంట్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్నాకులం: కేరళలోని ఎర్నాకులంలో టామీ థామస్ అనే వ్యక్తి ఫొటోగ్రాఫర్. శివదాసన్ అనే వ్యక్తి ఇంట్లో తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని, ఇంక్వెస్ట్ రిపోర్ట్ నిమిత్తం అతని మృతదేహానికి ఫొటోలు తీయాలని పోలీస్ స్టేషన్ నుంచి థామస్‌కు ఫోన్ వచ్చింది. దీంతో.. శివదాసన్ ఇంటికి వెళ్లి థామస్ ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. ఫొటోలు తీస్తుండగా.. అతనికి ఎవరో మూలిగిన శబ్దం వినిపించింది. తీరా.. ఆ శబ్దం ఎక్కడ నుంచి వస్తుందో తెలిసి షాకయ్యాడు. చనిపోయాడనుకున్న శివదాసన్ మూలిగినట్లు తెలియడంతో వెంటనే పోలీసులకు చెప్పి, అలర్ట్ చేశాడు.


శివదాసన్ బతికే ఉన్నాడని, చనిపోలేదని పోలీసులు గ్రహించారు. అతనికి ప్రస్తుతం త్రిసూర్‌లోని జూబ్లీ మిషన్ హాస్పిటల్‌లో ఐసీయూలో ప్రస్తుతం చికిత్సనందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన గురించి 48 ఏళ్ల వయసున్న ఫొటోగ్రాఫర్ థామస్ స్పందిస్తూ.. దాదాపు 25 సంవత్సరాల నుంచి పోలీసులతో కలిసి పనిచేస్తున్నానని.. ఇలాంటి అనుభవం గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పాడు.

Updated Date - 2020-07-15T00:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising