ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ కాలంలో ఆశ్రయమిస్తే స్నేహితుడి భార్యనే ఎత్తుకెళ్లాడు

ABN, First Publish Date - 2020-05-21T12:13:56+05:30

ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ వైవాహిక సంబంధాలను కూడా నాశనం చేస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొచ్చి(కేరళ): ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ వైవాహిక సంబంధాలను కూడా నాశనం చేస్తోంది. లాక్‌డౌన్ కాలంలో తనకు ఆశ్రయమిచ్చిన చిన్ననాటి స్నేహితుడి భార్యను లేపుకొని వెళ్లిన యువకుడి బాగోతం కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో వెలుగుచూసింది. ఇడుక్కీ జిల్లా మున్నార్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల లోథారియో అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.లాక్‌డౌన్ వల్ల లోథారియో మువత్తుపుజ పట్టణంలో  చిక్కుకుపోయాడు. మువత్తుపుజ పట్టణంలో తన చిన్ననాటి స్నేహితుడు భార్యా పిల్లలతో కలిసి ఉండటంతో అతని సహాయం కోరుతూ లోథారియో ఫోన్ చేశాడు. దీంతో తన చిన్ననాటి స్నేహితుడని లోథారియెను ఇంటికి తీసుకువచ్చి ఆశ్రయమిచ్చి భోజనం పెట్టాడు. స్నేహితుడని తాను ఇంటికి తీసుకువచ్చి ఆశ్రయమిస్తే స్నేహితుడే  తన భార్యను పిల్లలతో సహా ఎత్తుకెళ్లాడని ఓ వివాహితుడు మువత్తుపుజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పారిపోయిన వివాహితను పట్టుకువచ్చారు. తన భర్త స్నేహితుడితోనే తాను ఉంటానని భార్య చెప్పడంతో భర్తతోపాటు పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. కాగా పారిపోయిన భార్యను భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వీరికి ఇద్దరు పిల్లలున్నారని పోలీసులు చెప్పారు. భర్త స్నేహితుడితో కలిసి పారిపోయిన భార్యపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు బెదిరించడంతో ఆమె తిరిగి భర్తతో ఉండేందుకు అంగీకరించింది. స్నేహితుడితో లేచిపోయిన భార్యతో కాపురం చేసేందుకు భర్త కూడా అంగీకరించాడు. పారిపోతూ భార్య ఇంట్లో ఉన్న ఆభరణాలు తీసుకొని, భర్త కొన్న కారులోనే పారిపోవడం విశేషం. 

Updated Date - 2020-05-21T12:13:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising