ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేబీసీలో ప్రశ్నపై వివాదం... బిగ్ బీపై కేసు నమోదు!

ABN, First Publish Date - 2020-11-03T16:47:49+05:30

కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నఅమితాబ్ బచ్చన్ వివాదంలో చిక్కుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నఅమితాబ్ బచ్చన్ వివాదంలో చిక్కుకున్నారు. బిగ్ బీపై లక్నోలోని ఒక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ షో నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ కార్యక్రమంలో ఒక ప్రశ్నను అడిగారని లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ షోలో నిర్వహించిన కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్‌లో సామాజిక వేత్త బెజవాడ విల్సన్‌, నటుడు అనూప్‌ సోనీ పాల్గొన్నారు. వారిని అడిగిన ఓ ప్రశ్న వివాదానికి దారితీసింది. 


రూ. 6,40,000 క్యాష్ ప్రైజ్‌ అందించే ప్రశ్నగా అమితాబ్.... 1927, డిసెంబర్‌ 25న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ఆయన అనుచరులు ఏ గ్రంథం ప్రతులను తగులబెట్టారు అనే ప్రశ్నను అడిగారు.... దీనికి ఎ) విష్ణు పురాణం బి) భగవద్గీత సీ) రుగ్వేదం డి) మనుస్మృతి అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు జవాబుగా మను స్మృతి అనే ఆన్సర్ వచ్చింది. ఈ సందర్భంగా బిగ్ ‌బీ.. మనుస్మృతిని అప్పట్లో బీఆర్ అంబేద్కర్ ఎందుకు తగలబెట్టారనేదానిపై వివరణ ఇచ్చారు. దీంతో ఈ ప్రశ్న అడగటం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. ఈ నేపధ్యంలోనే ఓ వ్యక్తి అమితాబ్ బచ్చన్‌తో పాటు కేబీసీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2020-11-03T16:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising