ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రెండ్ సెట్టర్‌గా ఇవాంకా డ్రెస్సింగ్ స్టయిల్... ఫొటోలు వైరల్!

ABN, First Publish Date - 2020-02-27T13:46:34+05:30

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో అతని భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా కూడా పాల్గొన్న విషయం విదితమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో అతని భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా కూడా పాల్గొన్న విషయం విదితమే. ఈ సందర్భంగా ఇవాంకా ధరించిన దుస్తులు ట్రెండింగ్‌గా మారాయి. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. భారత పర్యటనలో ఇవాంకా తొలిరోజు రెడ్ అండ్ బ్లూ కలర్ లాంగ్ వన్‌పీస్ సూట్ ధరించారు. ఈ సూట్‌లో ఇవాంకా ఎంతో అందంగా కనిపించారు. ఈ సూట్‌ను ఆమె గతంలో కూడా ధరించారు. 2019లో ఇదే డ్రెస్‌లో ఇవాంకా కనిపించారు. అర్జెంటీనా పర్యటనలో ఆమె ఈ ఫ్రాక్ సూట్ ధరించారు. ఈ డ్రస్ ఖరీదు రూ. 1,71,331 (2,385 డాలర్లు) అని తెలుస్తోంది. 


రెండవ రోజు భారత్ పర్యటనలో ఇవాంకా ట్రెడిషినల్ డ్రెస్‌లో కనిపించారు. ముర్షీదాబాద్ సిల్క్‌తో రూపొందించిన వైట్ కలర్ ఐవరీ షెర్వానీ ధరించారు. దీనిని భారతీయ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేశారు. 


రాష్ట్రపతి భవన్‌లో జరిగిన డిన్నర్ పార్టీకి ఇవాంకా ట్రెడిషినల్‌లుక్ లో హాజరయ్యారు. భారతీయ డిజైనర్ రోహిత్ డిజైనింగ్ చేసిన డ్రెస్‌ను ఆమె దరించారు. ఈ డ్రెస్‌లో ఆమె అప్సరసలా ఉందంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు. ఈ ఫుల్ లోథా అనార్కలీ సూట్‌పై బంగారపు దారపు పోగులతో ఎంబ్రాయిడరీ చేశారు. దీంతో ఈ డ్రెస్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2020-02-27T13:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising