ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబ్బే.. ఇది ఇంటర్‌వెల్.. తిరిగి వచ్చేది మేమే : కమల్‌నాథ్

ABN, First Publish Date - 2020-05-27T21:48:13+05:30

తిరిగి రాజ్యాధికారం చేపట్టడంపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ : తిరిగి రాజ్యాధికారం చేపట్టడంపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఇంటర్‌వెల్ అని, తిరిగి తామే అధికార పగ్గాలను చేపట్టబోతున్నామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ పార్టీ దృష్టంతా కూడా రాబోయే ఉప ఎన్నికల మీదే ఉందని, 24 సీట్లలో 20 సీట్లను సునాయాసంగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఎలాంటి సౌకర్యాలు, సమాచారం లేకుండానే మోదీ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందని, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం వద్ద, శివరాజ్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిర్దిష్ట ప్రణాళికంటూ ఏదీ లేదని ఆయన విమర్శించారు. బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. తాము మాత్రం బేరసారాలు చేయం. రాష్ట్ర ప్రజలు అలాంటి వారికి కచ్చితంగా గుణపాఠం నేర్పుతారు. మాకేం భయం లేదు. ఇది ఇంటర్‌వెల్ మాత్రమే. మళ్లీ మేమే వస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.


సొంత నియోజకవర్గమైన ఛింద్‌వాడాలో నాయకులు కనిపించడం లేదన్న పోస్టర్లు వెలయడంపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగడం ఇదే ప్రథమమని, బీజేపీ నేతలు అధికార పగ్గాలు చేపట్టినా సరే... ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపడం లేదని కమల్‌నాథ్ మండిపడ్డారు. 


Updated Date - 2020-05-27T21:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising