ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరాఠీ బోధకుడు ఇందూరికర్ మహారాజ్ సంచలన సూచన

ABN, First Publish Date - 2020-02-13T15:12:00+05:30

మగపిల్లాడు పుట్టాలంటే దంపతులు ఏం చేయాలో మహారాష్ట్రలో అత్యంత జనాదరణ పొందిన మరాఠీ బోధకుడు ఇందూరికర్ మహారాజ్ సంచలన సూచన చేశారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మగపిల్లాడు పుట్టాలంటే దంపతులు ఏం చేయాలంటే...

పూణే (మహారాష్ట్ర): మగపిల్లాడు పుట్టాలంటే దంపతులు ఏం చేయాలో మహారాష్ట్రలో అత్యంత జనాదరణ పొందిన మరాఠీ బోధకుడు ఇందూరికర్ మహారాజ్ సంచలన సూచన చేశారు. క్రమ సంఖ్య ఉన్న తేదీల్లో భర్త భార్యను కలిస్తే మగపిల్లాడు జన్మిస్తాడని ఇందూరికర్ మహారాజ్ వెల్లడించారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ఓ కుగ్రామంలో మహారాజ్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘క్రమసంఖ్య తేదీల్లో భర్త భార్యతో కలిస్తే మగపిల్లాడు పుడతాడు, బేసి సంఖ్య ఉన్న తేదీల్లో భార్యతో గడిపితే ఆడపిల్ల పుడుతుంది. దుర్ ముహూర్తం సమయంలో భర్త భార్యతో లైంగికంగా కలిస్తే పుట్టిన బిడ్డ వల్ల కుటుంబానికే చెడ్డపేరు వస్తుంది’’ అని ఇందూరికర్ మహారాజ్ తనదైన శైలిలో ఇచ్చిన ఉపన్యాసంలో పేర్కొన్నారు. మహారాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్డీటీ) చట్టం యొక్క నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని ప్రభుత్వ అధికారి హెచ్చరించారు.

-------

Updated Date - 2020-02-13T15:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising