ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎఎస్ టాపర్ దంపతుల విడాకుల పిటిషన్

ABN, First Publish Date - 2020-11-21T12:17:34+05:30

సివిల్ సర్వీసు పరీక్షల్లో టాపర్ లుగా నిలిచి ప్రేమ వివాహం చేసుకున్న ఐఎఎస్ దంపతులు టీనా డాబీ, అథర్ అమీర్‌లు మరోసారి వార్తల్లోకి ఎక్కారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు

జైపూర్ (రాజస్థాన్): సివిల్ సర్వీసు పరీక్షల్లో టాపర్ లుగా నిలిచి ప్రేమ వివాహం చేసుకున్న ఐఎఎస్ దంపతులు టీనా డాబీ, అథర్ అమీర్‌లు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. యువ ఐఎఎస్ దంపతులు విడాకుల కోసం జైపూర్ లోని ఫ్యామిలీకోర్టు-1లో వీరిద్దరూ దరఖాస్తు చేసుకోవడం సంచలనం రేపింది. తాము కలిసి జీవించలేమని, అందువల్ల తమకు విడాకులు మంజూరు చేయాలని టీనాడాబీ, అథర్ అమీర్ ఖాన్ లు ఫ్యామిలీ కోర్టులో సమర్పించిన విడాకుల పిటిషన్ లో కోరారు. 2016 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులు 2018లో వివాహం చేసుకున్నారు. టీనా డాబీ 2015 యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల్లో టాపర్ గా నిలిచారు. కశ్మీరుకు చెందిన అథర్ ఆ పరీక్షల్లో రెండోస్థానంలో నిలిచారు. 


వీరిద్దరూ రాజస్థాన్ కేడర్ అధికారులు. శిక్షణ సమయంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని , దీంతో వీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. టీనా డాబీ సోషల్ మీడియా ఖాతాలో తన పేరులోని ఖాన్ ను తొలగించారు. అనంతరం అథర్ ఖాన్ కూడా తన ఇన్ స్టాగ్రాం నుంచి టీనా ఖాతాను అన్ ఫాలో చేశారు. గతంలో వీరిద్దరి ప్రేమ వివాహాన్ని లవ్ జిహాద్ గా హిందూ మహాసభ పేర్కొంది. టీనా ప్రస్థుతం రాజస్థాన్ రాష్ట్ర ఆర్థికశాఖలో జాయింట్ సెక్రటరీగా, అమీర్ అథర్ ఈజీఎస్ సీఈవోగా పనిచేస్తున్నారు. 

Updated Date - 2020-11-21T12:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising