ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఆస్పత్రిలో.. నర్సుల డ్యాన్సులు.. ఫిదా అవుతున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2020-04-11T02:40:04+05:30

కరోనా మహమ్మారి కారణంగా అల్లాడిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఓ ఆస్పత్రి. అక్కడ ఎక్కువ మంది కరోనా వైరస్ సోకిన పేషెంట్లే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా అల్లాడిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఓ ఆస్పత్రి. అక్కడ ఎక్కువ మంది కరోనా వైరస్ సోకిన పేషెంట్లే. ఆ ఆస్పత్రిలో పనిచేసే నర్సులు కాసేపటికి ఓసారి చిందులు వేస్తూ ఆనంద పడిపోతున్నారు. దీన్ని ఓ డాక్టర్ వీడియో తీసి నెట్టింట షేర్ చేశాడు. కరోనాతో లక్షలమంది ప్రాణాలు పోతుంటే ఈ చిందులేంటని తొలుత కోపగించుకున్నవారే.. ఆ తర్వాత నర్సుల డ్యాన్సులకు అసలు కారణం తెలుసుకుని ఫిదా అయిపోయారు. ఇంతకీ ఆ కారణమేంటంటే.. అమెరికాలోని రోనాల్డ్ రీగన్ యూసీఎల్‌ఏ మెడికల్ సెంటర్‌లో కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తారు. పేషెంట్ కోలుకోగానే వెంటిలేటర్ తీసేస్తారు. ఇదే ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇలా ఓ పేషెంట్‌కు వెంటిలేటర్ తీసేసిన ప్రతిసారీ ఈ ఆస్పత్రిలోని ఐసీయూ టీం నర్సులు ఇలా డ్యాన్సులు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

Updated Date - 2020-04-11T02:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising