ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుడి తండ్రి, వధువు తల్లి రెండోసారి లేచిపోయారు...

ABN, First Publish Date - 2020-03-02T13:44:48+05:30

గుజరాత్ రాష్ట్రంలో తమ పిల్లల పెళ్లికి ముందే వరుడి తండ్రి, వధువు తల్లితో లేచిపోయిన ఘటనలో తాజాగా కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూరత్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలో తమ పిల్లల పెళ్లికి ముందే వరుడి తండ్రి, వధువు తల్లితో లేచిపోయిన ఘటనలో తాజాగా కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సూరత్ నగరానికి హిమ్మత్ పాండవ్ (46) కుమారుడికి, విజాల్‌పురి పట్టణానికి చెందిన శోభనా రావల్(43) కుమార్తెతో పెళ్లి చేయాలని రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు నిర్ణయించి తేదీని కూడా నిర్ణయించారు. తమ పిల్లల పెళ్లికి ముందే వియ్యంకులు కావాల్సిన పెళ్లికొడుకు తండ్రి, పెళ్లి కుమార్తె తల్లితో కలిసి లేచిపోయారు. అనంతరం తమ తప్పు తెలుసుకొని వారు వాలంటైన్స్ డే కు ముందు వారి స్వస్థలాలకు తిరిగి వచ్చారు. వరుడి తండ్రి హిమ్మత్ పాండవ తన కుటుంబం ఉంటున్న ఇంటికి తిరిగి వచ్చారు.ఇన్నిరోజులు వియ్యంకుడితో కలిసి ఉన్న శోభనారావల్ ను ఆమె భర్త అంగీకరించక పోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తమ తప్పు తెలుసుకొని మధ్యవయసు ప్రేమికులు తిరిగి వచ్చారని అనుకున్నారు.


కాని వధువు తల్లికి సమాజంలో ఎదురైన చేదు అనుభవంతో హిమ్మత్ పాండవ్, శోభనారావల్ లు రెండవసారి లేచిపోయారు. వియ్యంకులు కావాల్సిన వారు ఇలా వియ్యపురాలితో లేచి పోవడంతో వారి పిల్లల పెళ్లి కాస్తా రద్దు అయింది. మధ్య వయసు ప్రేమికులైన హిమ్మత్ పాండవ్, శోభనా రావల్ లు తమ తమ కుటుంబాలను వదిలి రెండోసారి లేచి పోయి సూరత్ నగరంలోనే ఓ అద్దె ఇల్లు తీసుకొని నివశిస్తున్నట్లు తేలింది. వీరిద్దరూ యుక్తవయసులోనే ఓ పెళ్లిలో ఒకరిని మరొకరు చూసుకొని ప్రేమలో పడ్డారని, కానీ అప్పట్లో పెళ్లి చేసుకోలేక పోయారని తేలింది. చాలాకాలం తర్వాత కలిసిన వీరిద్దరూ ముందుగా తమ పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నారు కానీ, అలా చేస్తే అన్నాచెల్లెళ్లు అవుతారని, పెళ్లి కాదని పారిపోయి మధ్య వయసులో వేరు కాపురం పెట్టారని సమాచారం. 

Updated Date - 2020-03-02T13:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising