ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి ఊరేగింపు..వరుడితో సహా ఐదుగురి అరెస్ట్

ABN, First Publish Date - 2020-07-05T12:50:40+05:30

కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి సామాజిక దూరం పాటించకుండా, మాస్క్‌లు ధరించకుండా పెళ్లి ఊరేగింపు జరిపినందుకు వరుడితో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్ నిబంధనల ఉల్లంఘన

భువనేశ్వర్ (ఒడిశా): కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి సామాజిక దూరం పాటించకుండా, మాస్క్‌లు ధరించకుండా పెళ్లి ఊరేగింపు జరిపినందుకు వరుడితో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో వెలుగుచూసింది. గంజాం జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న అతిథులు కనీసం మాస్క్ లు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండానే డ్యాన్సులు చేశారు. ఈ నెల 2వతేదీన జరిగిన ఈ పెళ్లి ఊరేగింపు వీడియోను  సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. పలు పట్టణాల నుంచి ఈ పెళ్లికి అతిథులు వచ్చారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన జిల్లా అధికారులు పెళ్లి జరిగిన హోటల్ మై ఫెయిర్ ను సీలు చేశారు. వరుడితోపాటు వరుడి తండ్రి, అతని ముగ్గురు మామయ్యలను అరెస్టు చేసి, పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న రెండు వాహనాలను సీజ్ చేశామని గంజాం ఎస్పీ పినాక్ మిశ్రా చెప్పారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనపై పెళ్లి బృందంపై ఐపీసీ సెక్షన్ 188, 269, 270 ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 34 కింద కేసు నమోదు చేశామని ఎస్పీ వివరించారు. ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య 8601కి చేరుకోగా, ఒక్క గంజాం జిల్లాలోనే 2066 కేసులు నమోదైనాయి. 

Updated Date - 2020-07-05T12:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising