ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తర ధృవంలో వింత వాతావరణం.. ఓజోన్‌కు భారీ రంధ్రం

ABN, First Publish Date - 2020-04-10T00:31:08+05:30

ఉత్తర ధృవ ప్రాంతంలో వింత వారావరణం నెలకొంది. దీని కారణంగా ఓజోన్ పొరకు ఎన్నడూ లేనంత పెద్ద సైజులో రంధ్రం ఏర్పడింది. దీనిని కొప్పర్నకన్ శాటిలైట్ సాయంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రీన్‌లాండ్: ఉత్తర ధృవ ప్రాంతంలో వింత వారావరణం నెలకొంది. దీని కారణంగా ఓజోన్ పొరకు ఎన్నడూ లేనంత పెద్ద సైజులో రంధ్రం ఏర్పడింది. దీనిని కొప్పర్నకన్ శాటిలైట్ సాయంతో గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొద్ది రోజులుగా ఆర్కిటిక్ ప్రాంతంలోని వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను గమనిస్తున్నామని, వాటి కారణంగానే ఈ రంధ్రం ఏర్పడిందని యూరోపియన్ యూనియన్ శాస్త్రవేత్తలు వివరించారు. ‘అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉత్తర ధృవం వద్ద స్ట్రాటో ఆవరణంలో పెద్ద గాలి సుడిగుండం ఏర్పడిందని, దాని ద్వారా మానవ ఉద్గారాలైన క్లోరిన్, బయోమిన్ వంటి రసాయనాలు పైకి చేరుకుని ఓజోన్‌ను నాశనం చేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


ఇదిలా ఉంటే ఈ రంధ్రం ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని, అయితే ఈ రంధ్రం ఏమాత్రం దక్షిణం వైపు కదలినా ప్రమాదమేమని వివరిస్తున్నారు. ఈ రంధ్రం వల్ల సూర్య కిరణాలు నేరుగా నేలను తాకుతాయని, దాని ప్రభావం ప్రజలపై పడితే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని  శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఓజోన్‌కు ఇలా రంధ్రం పడడం ఇదేం కొత్త కాదని, ఈ రంధ్రం మరికొన్ని రోజుల్లో తిరిగి భర్తీ అవుతుందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

Updated Date - 2020-04-10T00:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising