ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగు చెవిలాంటి భారీ చేప... ఖ‌రీదు వింటే కంగుతింటారు!

ABN, First Publish Date - 2020-07-29T17:59:49+05:30

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని దిఘా తీరంలో ఈరోజు ఉదయం 780 కిలోల బ‌రువైన‌ జెయింట్ ఫిష్‌ను మత్స్యకారులు ప‌ట్టుకున్నారు. వారు ఈ చేప‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లోని దిఘా తీరంలో ఈరోజు ఉదయం 780 కిలోల బ‌రువైన‌ జెయింట్ ఫిష్‌ను మత్స్యకారులు ప‌ట్టుకున్నారు. వారు ఈ చేప‌ను శంకర్ ఫిష్ అని పిలుస్తుంటారు. ఈ చేప... ఏనుగు చెవి త‌ర‌హాలో 8 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు క‌లిగివుంది. మ‌త్స్య‌కారులు ఈ చేప‌ను రాష్ట్రంలోని ఒక చేపల వ్యాపార సంస్థకు రూ. 50,000 కు విక్రయించారు. త‌మ‌కు ల‌భ్య‌మైన అతి బ‌రువైన చేప ఇదేన‌ని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేప మాంటా రే చేపలా కనిపిస్తుంది. ఇటువంటి చేపలు రే కుటుంబానికి చెందినవి. తూర్పు భారతదేశంలోని అన్నిర‌కాల‌ రే చేపలను శంకర్ చేప అని పిలుస్తుంటారు. కాగా ఈ భారీ చేప‌ను చూసేందుకు జ‌నం గుమిగూడారు. ఈ చేప‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. శంకర్ చేపలను బెంగాల్‌లో మాంసాహారులు ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ ఏడాది మార్చిలోనూ దిఘా తీరంలో మత్స్యకారులను ఇటువంటి 300 కిలోల బరువున్న చేప‌ను ప‌ట్టుకున్నారు. 


Updated Date - 2020-07-29T17:59:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising