ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిన్లాండు విమానాశ్రయంలో కరోనా రోగులను గుర్తించేందుకు జాగిలాలు

ABN, First Publish Date - 2020-09-24T13:27:06+05:30

ఫిన్లాండు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా సోకిన ప్రయాణికులను గుర్తించడానికి జాగిలాలను రంగంలోకి దించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెల్పింకి (ఫిన్లాండు) : ఫిన్లాండు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా సోకిన ప్రయాణికులను గుర్తించడానికి జాగిలాలను రంగంలోకి దించారు. కరోనా వైరస్ సోకిన ప్రయాణికులను గుర్తించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ పరీక్ష పద్ధతిని నాలుగునెలల పాటు ప్రయోగాత్మకంగా విమానాశ్రయంలో జాగిలాలను మోహరించామని ఫిన్లాండు అధికారులు చెప్పారు. ఫిన్లాండు దేశంలోని హెల్పింకి విమానాశ్రయంలో జాగిలాలు కరోనా సోకిన వారిని గుర్తిస్తాయని జాగిలాల శిక్షకురాలు సుసన్నా పావిలైనెస్ తో క్సీ చెప్పారు. 


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత ఫిన్లాండు దేశంలో కరోనా రోగులను గుర్తించేందుకు జాగిలాలను వినియోగిస్తున్నారు. విమానాశ్రయంలోని ప్రయాణికులకు ఉచితంగా ఈ జాగిలాలతో కరోనా పరీక్ష చేయనున్నారు. జాగిలం పరీక్షలో కరోనా ఉందని తేలితే వారికి పీసీఆర్ పరీక్షలు కూడా చేస్తారు. ఫిన్లాండు విమానాశ్రయంలో రెండు షిప్టులలో పనిచేసేలా నాలుగు జాగిలాలను రంగంలోకి దించారు. 


ఫిన్లాండు దేశంలోని స్మెల్ డిటెక్షన్ అసోసియేషన్ శిక్షణ ఇచ్చిన నాలుగు జాగిలాలు హెల్పింకి అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం నుంచి కరోనా ప్రయాణికులను గుర్తించే పనిని ప్రారంభించాయి. కరోనా రోగులను వాసన ద్వారా జాగిలాలు గుర్తించేపద్ధతి చాలా మంచిదని, ఇది ఆశాజనకమైనదని హెల్పింకి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అన్నా హీల్మ్ జోర్క్మన్ చెప్పారు. 

Updated Date - 2020-09-24T13:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising