ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శునకానికి ఘనంగా అంతిమయాత్ర... భారీ అన్నసంతర్పణ!

ABN, First Publish Date - 2020-10-17T14:12:12+05:30

యూపీలోని మీరఠ్‌ పరిధిలోగల బాధం గ్రామంలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక రైతు తాను పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘పుష్ప’ మృతి చెందిన నేపధ్యంలో 13వ రోజున గ్రామస్తులందరికీ భారీ అన్న సంతర్ఫణ కార్యక్రమం నిర్వహించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరఠ్: యూపీలోని మీరఠ్‌ పరిధిలోగల బాధం గ్రామంలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక రైతు తాను పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘పుష్ప’ మృతి చెందిన నేపధ్యంలో 13వ రోజున గ్రామస్తులందరికీ భారీ అన్న సంతర్ఫణ కార్యక్రమం నిర్వహించాడు. దీనికి ముందు ఆ రైతు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక కార్డులను ముద్రించి గ్రామస్తులందరికీ పంచాడు. రైతు యోగేష్ తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క మృతి చెందడంతో దానికి హిందూ సాంప్రదాయం ప్రకారం బాజా బజంత్రీల మధ్య అంత్యక్రియలు నిర్వహించాడు.



తరువాత ‘పుష్ఫ’ అస్థికలను పుణ్య నదిలో కలిపాడు. ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ‘పుష్ప’ను యోగేష్ ఆరేళ్ల పాటు పెంచిపోషించాడు. అది మృతి చెందినపుడు ఇంటిలోని సభ్యుడే మరణించిన రీతిగా యోగేష్ కుమిలిపోయాడు. గ్రామస్తులంతా వెంటరాగా యోగేష్ ఆ శునకానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ శునకం మరణించిన తరువాత 13వ రోజున శాంతి హోమాన్ని నిర్వహించాడు. 13 మంది బ్రాహ్మణులకు దక్షిణాది తాంబూలాలు సమర్పించి ఘనంగా సత్కరించాడు. 

Updated Date - 2020-10-17T14:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising