ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్తకు భరణం ఇవ్వాలంటూ భార్యకు ఆదేశాలు!

ABN, First Publish Date - 2020-10-22T22:35:28+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఫ్యామిలీ కోర్టు భర్త నుంచి విడిగా ఉంటున్న ఓ మహిళకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వ పెన్షనర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముజఫరాబాద్: ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఫ్యామిలీ కోర్టు భర్త నుంచి విడిగా ఉంటున్న ఓ మహిళకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వ పెన్షనర్‌ అయిన ఆమె ప్రతినెలా భర్తకు భరణం కింద రూ.1000 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. చాలా సంవత్సరాలుగా భార్యాభర్తలు ఇరువురూ విడివిడిగా జీవిస్తున్నారు. అయితే హిందూ వివాహ చట్టం-1955 కింద తన భార్య నుంచి భరణం ఇప్పించాలంటూ ఆమె భర్త 2013లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న ఫ్యామిలీ కోర్టు తుదితీర్పు వెలువరించింది. భార్య ఓ ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేయడంతో ఆమెకు ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ.12 వేలు పెన్షన్ వస్తోంది. దీంతో ఆమె తన భర్తకు నిర్వహణ ఖర్చుల కింద ప్రతినెలా రూ. 1000 చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.  

Updated Date - 2020-10-22T22:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising