ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడ్లగూబను పస్తులుంచారు, అద్భుతం జరగడంతో...

ABN, First Publish Date - 2020-02-08T23:29:38+05:30

అధికబరువుతో సతమతమవుతున్న గుడ్లగూబతో డైటింగ్ చేయించడంతో అద్భుతం జరగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఓ గుడ్లగూబ ఎగరలేక గుడ్లుతేలేసింది. ఊబకాయంతో తెగ బరువెక్కిపోవడేమే దాని దీన స్థితికి కారణం. ఓ చిన్న గొయ్యిలో చతికిల పడ్డ ఆ పక్షిని చూసి ఇంగ్లండ్‌లోని సఫ్ఫోల్క్‌ బర్డ్ శాంక్చువరీ అధికారులు షాకయ్యారు. అది ఏదైనా వ్యాధితో బాధపడుతోందేమోనని తొలుత భావించారు. అన్ని వైద్య పరీక్షలూ చేశారు. అంతా సవ్యంగానే ఉన్నట్టు రిపోర్టుల్లో తేలింది. ఈ క్రమంలో వారు దాని బరువును కూడా కొలిచారు. ఉండవలసిన దాని కన్నా ముడు రెట్లు ఎక్కువ బరువు ఉండటంతో వారు ఒక్కసారిగా షాకయ్యారు. ఇదేమైనా పెంపుడు గుడ్లగూబా అనే సందేహం వారి మదిలో మెదిలింది. అయితే దాని కాళ్లకు ఎటువంటి స్టిక్కర్లుగానీ, పట్టీలుగానీ లేవు.

అడవిలో స్వేఛ్చగా విహరించే జీవి కూడా ఇలా ఒబెసిటీతో బాధపడటం వారిని ఆశ్చర్య పరిచింది. అయితే పరిష్కారం గురించి ఆలోచించే కొద్దీ వారికి డైటింగే ఈ సమస్యకు పరిష్కారమని అనిపించింది. అయినా వారి మదిలో ఎక్కడో చిన్న సందేహం. అయితే మరో దారి లేని పరిస్థితిలో వారు గుడ్లగూబ‌తో డైటింగ్ చేయించారు. దానికి అందించే ఆహారంలో భారీగా కోత పెట్టారు. అత్యవసరమైన కేలరీలు మాత్రమే అందేలా చర్యలు తీసుకున్నారు. లంఖణం పరమౌషధం అన్న చందంగా ఈ చికిత్స జరిగింది. అయితే వారి సందేహాలన్నీ దూరం చేస్తూ.. ఈ ట్రీట్‌మెంట్ చక్కని ఫలితాలిచ్చింది. గూడ్లగూబ బరువు సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో అది ఎగరటం కూడా ప్రారంభించింది. అద్భుతం జరిగిందంటూ సంబరపడిపోయారు సదరు శాంక్చువరీ అధికారులు!

Updated Date - 2020-02-08T23:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising