ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూత్రాశయంలో చార్జర్ కేబుల్.. ఎలా వెళ్లిందో తెలిసి డాక్టర్స్ షాక్

ABN, First Publish Date - 2020-06-06T03:06:59+05:30

అనుకోకుండా ఇయర్‌ఫోన్స్ మింగేశానని, కడుపులో తీవ్రంగా నెప్పిగా ఉందని ఓ 30 ఏళ్ల వ్యక్తి అస్సాంలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిస్‌పూర్: అనుకోకుండా ఇయర్‌ఫోన్స్ మింగేశానని, కడుపులో తీవ్రంగా నెప్పిగా ఉందని ఓ 30 ఏళ్ల వ్యక్తి అస్సాంలోని ఓ స్థానిక ఆసుపత్రికి వచ్చాడు. వెంటనే డాక్టర్లు అతడిని పరీక్షించారు. ఎండోస్కోపీ, లాబోరేటరీ టెస్టులు వంటి అన్ని రకాల పరీక్షలూ చేశారు. అయినా ఎక్కడా ఏమీ కనపడలేదు. దీంతో అక్కడి సీనియర్ డాక్టర్ వాలీ ఇస్లాం అతడికి ఎక్స్‌-రే తీయించాడు. వచ్చిన రిపోర్టులు చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు. దీనికి కారణం అతడి యూరినరీ బ్లాడర్(మూత్రాశయం)లో చుట్టలు చుట్టుకుని ఉన్న ఓ కేబుల్ కనపడింది. ఎవరైనా మింగితే అది కడుపులోకి వెళ్లాలి, పేగుల్లోనో, జీర్ణాశయంలోనో ఉండాలి. కానీ ఇతడికి మాత్రం మూత్రాశయంలోకి ఎలా వస్తుంది. అదే డౌట్ ఇస్లాంకు కూడా వచ్చింది. కొంతసేపు ఆలోచించి దానికి కారణాన్ని కనుగొన్నాడు. ఆపరేషన్ చేసి ఆ కేబుల్‌ని బయటకు తీశాడు. అయితే అది ఇయర్‌ఫోన్ కేబుల్ కాదు. చార్జింగ్ కేబుల్. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలను, ఆపరేషన్ చేసి కేబుల్‌ను బయటకు తీసిన వీడియోను ఇస్లాం తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన 25 ఏళ్ల ఇలాంటి కొన్ని కేసులు చూసినప్పుడు తాను షాక్ అవుతుంటానని ఇస్లాం అందులో రాసుకొచ్చాడు.


‘ఈ కేబుల్ అక్కడకు ఎలా వెళ్లిందో అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇతడే ఆ కేబుల్‌ను తన పురుషాంగం ద్వారా జొప్పించుకున్నాడు. మా వద్దకు వచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ఇది చూసిన నాకు అతడి మానసిక స్థితిపైనే అనుమానం కలుగుతోంది. సర్జరీ విజయవంతంగా పూర్తయింది. అతడు కోలుకుంటున్నాడు. అయితే ఈ భూమ్మీద ఏదైనా జరుగవచ్చు’ అంటూ ఇస్లాం చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-06-06T03:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising