ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంకిత భావానికి ఉదాహరణ ఆ వైద్యుడు!

ABN, First Publish Date - 2020-09-06T16:51:20+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, కరోనా బారినపడినవారని కాపాడేందుకు వైద్యులు నిరంతరం అంకిత భావంతో పనిచే్స్తున్నారు. కొంతమంది వైద్యులు 24 గంటలూ ఆసుపత్రిలో అందుబాటులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, కరోనా బారినపడినవారని కాపాడేందుకు వైద్యులు నిరంతరం అంకిత భావంతో పనిచే్స్తున్నారు. కొంతమంది వైద్యులు 24 గంటలూ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ నిరంతర సేవలను అందిస్తున్నారు. ఇటువంటివారిలో ఒకరే ఢిల్లీకి చెందిన అజీజ్ జైన్(52). ఆయన గత ఐదు నెలలుగా ఇంటికి వెళ్లకుండా, ఆసుపత్రిలోనే ఉంటూ వైద్య సేవలు అందిస్తూవచ్చారు. వీలుచిక్కినప్పుడు రాత్రవేళ అజీజ్ జైన్ ఇంటికి ఫోన్ చేసినపుడు అతని కుమార్తెలు ‘డాడీ మీరు ఎప్పుడు ఇంటికి వస్తారు?’ అని అడిగేవారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ అజీజ్ జైన్ పనిచేస్తున్నారు. అతని ఇల్లు ఆసుపత్రికి 13 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ, ఆయన ఇంటికి వెళ్లి ఐదు నెలలు అయ్యింది. ఇంత సుదీర్ఘకాలం తరువాత డాక్టర్ అజీజ్ ఇంటికి చేరుకోగానే, అతని ఇద్దరు కుమార్తెలు తలుపు తీయగా, భార్య హారతిచ్చి లోనికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అతని కుమార్తెలు ఒక వీడియో తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ జైన్ మాట్లాడుతూ మార్చిలో కరోనా అంతకంతకూ విజృంభిస్తున్న సమయంలో దీనిపై పోరాటం సాగించాలని నిర్ణయించుకున్నాం. మొదట్లో కుటుంబంలోని వారికి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇంటికి వెళ్లకూడదని అనుకున్నాం. వృద్ధులైన తల్లిదండ్రులకు, పిల్లలకు కరోనా సోకకుండా ఉండేందుకు ఇంటికి వెళ్లలేదు. తరవాత ఆసుపత్రిలో బాధితుల సంఖ్య పెరగడంతో, వారికి వైద్య సేవలు అందించడంలో మునిగిపోయాం. వీలు చిక్కినప్పుడు కుటుంబ సభ్యులకు ఫోను చేసేవాడినని తెలిపారు. 

 


Updated Date - 2020-09-06T16:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising