ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమికులని నిరూపించుకున్నాకే కలుసుకునేందుకు అనుమతిస్తాం: డెన్మార్క్‌ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-05-26T02:17:04+05:30

కరోనా ఆంక్షలు ప్రేమికులకు యడబాటును కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఈ ఆంక్షలకు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోపెన్‌హేగన్: కరోనా ఆంక్షలు ప్రేమికులకు యడబాటును కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఈ ఆంక్షలకు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు అత్యంత జాగరూకత వహిస్తున్నాయి. తాజాగా స్కాండినేవియా దేశమైన డెన్నార్క్ కూడా అదే దారిలో వెళుతోంది. ఇతర స్కాండినేవియా దేశాలతో ఉన్న సరిహద్దులను తెరిచి రాకపోకలకు ఆస్కారం కల్పిస్తోంది. అయితే ఎవరిని దేశంలోకి అనుమతించాలనే విషయంపై పకడ్బందీగా అడుగులేస్తున్న డెన్నార్క్ ప్రభుత్వం వేరు వేరు దేశాల్లో చిక్కుకుపోయిన ప్రేమికుల విషయంలో కొత్త నిబంధన తీసుకొచ్చింది. విదేశాల్లోని వారు.. డెన్నార్క్‌లో ఉన్న తమ మనసైన వారిని కలుసుకోవాలనుకుంటే ముందుగా తాము ప్రేమికులమని నిరూపించుకోవాలంటూ ఓ నిబంధన విధించింది. గత ఆరు నెలలుగా తాము ప్రణయ బంధంలో ఉన్నట్టు ఫోటోలు, ప్రేమలేఖలు వంటి ఆధారాలను సరిహద్దు వద్ద ఉన్న అధికారులకు చూపించాలని స్పష్టం చేసింది. ఈ అధారాలతో అధికారులు సంతృత్పి చెందితేనే దేశంలో అడుగుపెట్టే అనుమతి లభిస్తుందని స్పష్టం చేసింది. ‘ఈ చిత్రాలు ప్రేమలేఖలు వ్యక్తిగతమైన విషయాలని మాకు తెలుసు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితుల రీత్యా మనకు వేరు మార్గం లేదు’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-05-26T02:17:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising