ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాపం సైక్లిస్ట్.. పల్టీకొట్టి బ్రహ్మజెముడు పొదల్లో పడడంతో..

ABN, First Publish Date - 2020-11-13T21:05:22+05:30

రేసింగ్‌ పోటీల్లో పాల్గొన్న ఓ ఔత్సాహిక సైక్లిస్ట్ ప్రమాద వశాత్తూ తన సైకిల్ కొట్టడంతో ఎగిరి ఏకంగా బ్రహ్మజెముడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యూనస్ ఎయిర్స్: రేసింగ్‌ పోటీల్లో పాల్గొన్న ఓ ఔత్సాహిక సైక్లిస్ట్ ప్రమాద వశాత్తూ తన సైకిల్ పల్టీ కొట్టడంతో ఎగిరి ఏకంగా బ్రహ్మజెముడు పొదల్లో పడిపోయిన వైనమిది. వేలాది ముళ్లు ఒకేసారి ఒళ్లంతా గుచ్చుకోవడంతో అతడు కనీసం నడవలేక విలవిల్లాడాడు. స్థానికులు అప్రమత్తమై హుటాహుటిన ముళ్లన్నీ తొలగించి ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు కూడా అతడి శరీరం నుంచి వేలాది ముళ్లు బయటికి తీశారు. గాయపడిన సైక్లిస్టును డియాగో మొరేనో‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వొళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా చికిత్స తీసుకున్న అనంతరం సదరు సైక్లిస్టు మాట్లాడుతూ... ‘‘థాంక్ గాడ్.. నేను కళ్లద్దాలు, హెల్మెట్ ధరించాను కాబట్టి సరిపోయింది. తల, ముఖంమీద గాయాలు కాకుండా తప్పించుకున్నాను...’’ అని పేర్కొన్నాడు. 



Updated Date - 2020-11-13T21:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising