ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేక ఆందోళన శిబిరంలో వధూవరుల వినూత్న వివాహం

ABN, First Publish Date - 2020-02-18T17:53:54+05:30

పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన శిబిరంలోనే ఓ జంట పెళ్లి చేసుకున్న ఉదంతం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై (తమిళనాడు): పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన శిబిరంలోనే ఓ జంట పెళ్లి చేసుకున్న ఉదంతం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. చెన్నైలోని వాషర్‌మ్యాన్ పేటకు చెందిన షహన్ షా, సుమయలకు పెళ్లి చేయాలని పెద్దలు కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం చేశారు. వీరిద్దరికి పెళ్లి చేయాలని అనుకున్నా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వాషర్‌మ్యాన్ పేటలో నిత్యం నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిరసన కార్యక్రమాల వల్ల స్థానికులెవరూ పెళ్లికి రాలేరని, దీంతో నిరసనకారుల మధ్యే తాము పెళ్లి చేసుకోవాలని వధూవరులు నిర్ణయించుకున్నారు. వందలాదిమంది నిరసనకారుల మధ్య ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెళ్లి వేడుకను నిర్వహించారు.వధూవరులు సైతం నో ఎన్నార్సీ, నో సీఏఏ అంటూ ప్లకార్డు చేతబట్టి నిరసన తెలిపారు. పెళ్లి వేడుకల్లోనూ సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగడం విశేషం. 

Updated Date - 2020-02-18T17:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising