ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌ఫోన్‌పై కరోనా వైరస్.. బతికేది ఎన్ని రోజులంటే?

ABN, First Publish Date - 2020-04-01T03:18:09+05:30

స్మార్ట్‌ఫోన్‌పై కరోనా వైరస్ ఎన్ని రోజులు బతుకుతుంది? అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌పై కరోనా వైరస్ ఎన్ని రోజులు బతుకుతుంది? అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. కనీసం నాలుగు రోజులపాటు ఈ వైరస్ స్మార్ట్‌ఫోన్ గ్లాస్‌పై బతికి ఉండే అవకాశం ఉందని అధ్యయనకారులు తేల్చారు. 2003లో వచ్చిన సార్స్ వైరస్ గాజు ఉపరితలంపై 4 రోజులు వరకు జీవించి ఉండగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అప్పట్లో పేర్కొంది. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపరితలాలపై మూడు రోజులు, కార్డుబోర్డు ఉపరితలాలపై 24 వరకు మనగలుగుతుందని అధ్యయనం తెలిపింది. అయితే, గాజు ఉపరితలంపై ఎంతకాలం జీవిస్తుందన్న దానిపై స్పష్టత లేనప్పటికీ గతంలో జరిపిన అధ్యయనాల ఆధారంగా ఈ వైరస్ నాలుగు రోజులపాటు జీవించి ఉండే అవకాశం ఉందని అధ్యయనకారులు తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లు గ్లాస్‌, లేదంటే ప్లాస్టిక్ పదార్థాలతో తయారుచేస్తారు కాబట్టి వీటి స్క్రీన్లపైనా నాలుగు రోజులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని , ఫోన్ వాడిన తర్వాత అదే చేతులతోనేరుగా ముక్కు, కళ్లు, నోటిని తాకవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2020-04-01T03:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising