ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ దారిపేరు వింటే వ‌ణుకు ఖాయం!

ABN, First Publish Date - 2020-05-21T15:05:04+05:30

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతోంది. అయితే ఈ కొరోనా సంక్షోభ సమయంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో అర్థాంత‌రంగా ఆగిపోయిన‌ రహదారిని నిర్మించారు. గ్రామస్తులు ఈ రహదారికి కరోనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మద్‌నగర్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతోంది. అయితే ఈ కొరోనా సంక్షోభ సమయంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో అర్థాంత‌రంగా ఆగిపోయిన‌ రహదారిని నిర్మించారు. గ్రామస్తులు ఈ రహదారికి కరోనా రోడ్ అని పేరు పెట్టారు. ఇంతేకాదు అక్క‌డ కరోనా రోడ్ అనే సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అహ్మద్‌నగర్ జిల్లాలో గ‌ల‌ మాండవా గ్రామంలో ఈ రహదారిని లాక్‌డౌన్‌ సమయంలో గ్రామస్తులంతా కలిసి నిర్మించారు. అనంత‌రం ఈ ర‌హ‌దారికి క‌రోనా రోడ్ అనే పెట్టాల‌ని నిర్ణ‌యిచుకున్నారు. అహ్మద్‌నగర్‌లోని మాండవ గ్రామం నుంచి లక్ష్మీవాది వరకు స‌రైన రోడ్డు మార్గంలేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో వీలైనంత త్వ‌ర‌గా ఈ రోడ్డును నిర్మించాల‌ని గ్రామ‌స్తులంతా అనుకున్నారు.  గ్రామానికి చెందిన కొంత‌మంది తమ భూమిని  రహదారి కోసం దానం చేశారు. ఈ నేప‌ధ్యంలో గ్రామ‌స్తులంతా చేయిచేయివేసి ర‌హ‌దారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. 

Updated Date - 2020-05-21T15:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising