ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు ఏడాది పూర్తి.. సోషల్ మీడియాలో మీమ్స్

ABN, First Publish Date - 2020-11-17T23:49:49+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఏడాది పూర్తయిందట. సరిగ్గా ఇదే రోజున వూహాన్‌లో తొలి కరోనా కేసు నమోదైందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఏడాది పూర్తయిందట. సరిగ్గా ఇదే రోజున వూహాన్‌లో తొలి కరోనా కేసు నమోదైందట.  అయితే ఇది అనధికారిక లెక్కట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కరోనా ఫస్ట్ యానివర్సరీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కొందరైతే కరోనా మీమ్స్‌ను కూడా తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు. చైనాకు చెందిన అనధికారిక నివేదిక ప్రకారం 2019 నవంబరు 17న తొలి కరోనా కేసు చైనాలో నమోదదైందట. స్థానిక హుబెయ్ ప్రావిన్స్‌లోని 55 ఏళ్ల వ్యక్తికి తొలిసారిగా కరోనా సోకిందనేది ఆ నివేదిక సారాంశం.


 మొత్తంగా నవంబరులోనే దాదాపు నలుగురు పురుషులు, అయిదుగురు మహిళలు కరోనా బారిన పడినట్లు సమాచారం. కానీ వీరినెవరినీ చైనా ప్రభుత్వం తొలి కరోనా కేసుగా గుర్తించలేదు. డిసెంబరులో వూహాన్ వెట్ మార్కెట్‌‌లో పనిచేస్తున్న ఓ మహిళనే పేషెంట్ జీరో అంటూ ప్రకటించింది.



Updated Date - 2020-11-17T23:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising