ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెచ్చిపోయిన రెస్టారెంట్.. తినాలంటే బరువు చెప్పాల్సిందే అంటూ..

ABN, First Publish Date - 2020-08-16T04:21:59+05:30

ఆహార వృథాను అరికట్టేందుకు ఓ చైనా రెస్టారెంట్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడింది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రెస్టారెంట్ యాజమాన్యానికి తల బొప్పికట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: ఆహార వృథాను అరికట్టేందుకు ఓ చైనా రెస్టారెంట్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడింది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రెస్టారెంట్ యాజమాన్యానికి తల బొప్పికట్టింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కాలంలో చైనా ప్రభుత్వం ఆహార వృధాను అరికట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను, క్యాంపెయిన్‌లను నిర్వహించింది. ఈ ప్రచార హోరుతో చెంగాషా నగరంలోని ఓ రెస్టారెంట్‌ యజమాన్యానికి ఉత్సుహాం ఉరకలెత్తింది. దీంతో దేశాన్ని పీడిస్తున్న ఈ వృథాని అరికట్టేందుకు వారు వినియోగదారుల బరువు ఆధారంగా వంటకాలను రూపొందించారు. అంతే కాకుండా.. ఓ యాప్ కూడా తయారు చేసి ఈ వివరాలను అందులో పొందుపరిచారు. అనంతరం.. డిన్నర్ కోసం వచ్చే కస్టమర్లందరూ ముందుగా తమ బరువు తూచుకుని యాప్‌లో పొందుపరచాలని సూచించారు. ఆ తరువాత కస్టమర్ల బరువుకు సరిపడా యాప్ చూపే ఆహారపదార్థాల్లోంచి ఏదో ఒకటి  ఎంచుకోవాలని వినియోగదారులకు సూచించారు. పాపం.. ఈ ఐడియో తెగ హిట్టైపోతుందని ఆశించారు. కానీ సీన్‌ కాస్తా ఊహించని మలుపు తిరిగింది. బలవంతంగా బరువు చెప్పాలనే విధానం గురించి సోషల్ మీడియాలో గుప్పుమనడంతో దబిడిదిబిడి మొదలైపోయింది. తమ కామెంట్లతో రెస్టారెంట్ నిర్వహకులను నెటిజన్లు ఉతికారేశారు. దీంతో కంగుతిన్న నిర్వహకులు.. తప్పైపోయిందని లెపంలేసుకుంటూ చేసిన తప్పును సరిదిద్దుకున్నారు.  

Updated Date - 2020-08-16T04:21:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising